SNP
వన్డే వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ఇంటి బాట పట్టింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌పై చిన్న ఆశ ఉన్నా.. టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేయాల్సి రావడంతో అది కాస్త ఆవిరైపోయింది. అయితే.. మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి నమోదు అయింది. అదేంటో.. ఎవరు వేశారో ఇప్పుడు చూద్దాం..
వన్డే వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ఇంటి బాట పట్టింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌పై చిన్న ఆశ ఉన్నా.. టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేయాల్సి రావడంతో అది కాస్త ఆవిరైపోయింది. అయితే.. మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి నమోదు అయింది. అదేంటో.. ఎవరు వేశారో ఇప్పుడు చూద్దాం..
SNP
ఈ వన్డే వరల్డ్ కప్ 2023లో ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. వన్డే క్రికెట్ చరిత్రలోనే గొప్ప ఇన్నింగ్స్‌ను కూడా చూశాం. ఎన్నో మంచి మంచి బౌలింగ్ ప్రదర్శనలు చూసి క్రికెట్‌ను ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే క్రమంలో వన్డే క్రికెట్‌లోనే కాదు అసలు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి కూడా ఈ వరల్డ్ కప్‌లోనే నమోదు కావడం విశేషం. పైగా ఈ మహా అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఎవరో కాదు.. పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తానంటూ హెచ్చులకే పోయే రౌఫ్.. వరల్డ్ కప్ నుంచి ఇంటికి వెళ్తున్నామనే ఫ్రస్టేషన్‌లో ఉన్నాడో ఏమో కానీ, ఓ భారీ వైడ్‌తో తమ కెప్టెన్ బాబర్ అజమ్‌తో పాటు మొత్తం క్రికెట్ ప్రపంచాన్నే షాక్‌కు గురిచేశాడు.
పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే కచ్చితంగా భారీ అంటే అతి భారీ విజయం సాధించాల్సిన మ్యాచ్‌లోనే హరీస్ రౌఫ్ అత్యంత చెత్త డెలవరీ వేశాడు. ఇంగ్లండ్‌తో కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్-పాక్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 280కిపై పరుగుల భారీ తేడాతో గెలిస్తే కానీ సెమీస్ చేరే అవకాశం ఉండదు. కర్మకాలి.. టాస్ ఓడిపోయి తొలుత ఫీల్డింగ్ చేయాల్సి వస్తే.. ఇక అంతే. సెమీస్ ఆశలు గల్లంతే. వారి దరిద్రం కొద్ది అదే జరిగింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాక్‌కు మిగిలి ఉన్న చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది. ఆ కోపంతో బరిలోకి దిగిన రౌఫ్.. తన తొలి ఓవర్, ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతిని అతి భారీ వైడ్‌గా వేశాడు. అది బ్యాటర్‌కే కాదు, వికెట్ కీపర్‌కు చాలా దూరంగా వెళ్లి, క్షణాల్లో బౌండరీ లైన్‌కు చేరింది.
క్రికెట్ చరిత్రలో ఎలాంటి ఒత్తిడి లేకుండా, మ్యాచ్‌లో తన తొలి బంతిని ఇంత పెద్ద వైడ్‌గా వేసిన బౌలర్ ఎవరూ లేరేమో. అందుకే హరీస్ రౌఫ్ వేసిన ఈ బాల్‌ను చరిత్రలోనే అత్యంత చెత్త బంతిగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఎంత వరల్డ్ కప్ నుంచి ఇంటికి వెళ్లిపోయినా మరీ ఇంత చెత్త బాల్ వేయాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వైడ్ బాల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాపం టాస్ కూడా గెలవలేని వారి దరిద్రాన్ని రౌఫ్ ఈ విధంగా చూపిస్తున్నాడు అంటూ చాలా మంది అంటున్నారు. మరి కిందనున్న వీడియో చూపి.. రౌఫ్ వేసిన వైడ్ బాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.