iDreamPost
android-app
ios-app

విభేదాలు.. 70 శాతం ఆస్తిని ట్రాన్స్‌ఫర్‌ చేసిన హార్ధిక్‌ పాండ్యా?

  • Published May 25, 2024 | 9:53 AM Updated Updated May 25, 2024 | 9:53 AM

Hardik Pandya, Natasha, Divorce: పాపం పాండ్యా.. నిన్నటి వరకు ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు పర్సనల్‌ లైప్‌లో కూడా ఒడిదుడుకులు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పాటే ఆస్తి విషయంలో కూడా పంపకాలు జరిగినట్లు సమాచారం. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Hardik Pandya, Natasha, Divorce: పాపం పాండ్యా.. నిన్నటి వరకు ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు పర్సనల్‌ లైప్‌లో కూడా ఒడిదుడుకులు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పాటే ఆస్తి విషయంలో కూడా పంపకాలు జరిగినట్లు సమాచారం. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published May 25, 2024 | 9:53 AMUpdated May 25, 2024 | 9:53 AM
విభేదాలు.. 70 శాతం ఆస్తిని ట్రాన్స్‌ఫర్‌ చేసిన హార్ధిక్‌ పాండ్యా?

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా జీవితంలో ప్రస్తుతం బ్యాడ్‌ టైమ్‌ నడుస్తున్నట్లు ఉంది. పాపం.. అన్ని అతనికి వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో గాయంతో మధ్యలోనే టోర్నీకి దూరం కావడం. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వస్తే వ్యతిరేకత వ్యక్తం కావడం.. క్రికెట్‌ అభిమానులు అతన్ని దారుణంగా ట్రోల్‌ చేయడం, అతని కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ చెత్త ప్రదర్శన కనబర్చడం ఇలా.. అన్ని ప్రతికూలంగానే జరిగాయి. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా తీవ్ర కుదుపు వచ్చినట్లు సమాచారం. అదేంటంటే.. పాండ్యా దంపతులు విడిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. భార్య నటాషాకు విడాకులు ఇస్తున్నట్లు.. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

అయితే.. ఈ విడాకుల ప్రక్రియలో భాగంగా హార్ధిక్‌ పాండ్యా తన ఆస్తి 70 శాతం వాటాను నటాషాకి ‍ట్రాన్స్‌ఫర్‌ కూడా చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా క్రికెటర్‌గా, ఐపీఎల్‌తో పాటు ప్రకటన కర్తగా హార్ధిక్‌ పాండ్యా సంపాదన కొన్ని కోట్లలో ఉంటుంది. అంత మొత్తంలో 70 శాతం వాటా అంటే.. వేల కోట్లలో ఉండొచ్చు. మరి అంత మొత్తాన్ని భరణం కింద చెల్లించాడా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. వీరిద్దరి మధ్య అసలు విభేదాలు ఎందుకు వచ్చాయి? ఎప్పుడూ ఎంతో హ్యాపీగా కనిపించే ఈ జంట.. ఒక్కసారిగా ఇలా విడాకులు తీసుకుంటున్నారు అనే ప్రచారం ఎందుకు గుప్పుమంది అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్‌ మీడియలో అయితే.. వీరిద్దరు విడాకులు తీసుకున్నారు అనే బజ్‌ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తోంది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పాండ్యాతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడం లేదు నటాషా. ఈ పాయింట్‌ను పట్టుకుని కొంతమంది సోషల్‌ మీడియాలో పాండ్యా-నటాషా మధ్య విభేదాలు వచ్చాయని త్వరలోనే పూర్తిగా విడిపోతారని అంటున్నారు. ఇదే విషయంపై నేషనల్‌ మీడియాలోని కొన్ని ప్రధాన వార్త సంస్థలు కూడా కథనాలు వెల్లడించాయి. నేషనల్‌ మీడియాలో వీరిద్దరి గురించి వార్తలు రావడంతో.. క్రికెట్‌ అభిమానులు కూడా విడాకుల విషయాన్ని నమ్ముతున్నారు. ఇక వైపు విడాకులపై ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలోనే నటాషా నుదుటిపై బొట్టు పెట్టుకుని.. “అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు” అంటూ ఓ పిక్ ను పోస్ట్ చేసింది. దీంతో క్రికెట్‌ అభిమానులు, పాండ్యా ఫ్యాన్స్‌ అయోమయంలో పడిపోయారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ