Hardik Pandya: పాండ్యా గురించి లేటెస్ట్ అప్డేట్! IPL, ఆఫ్గాన్ సిరీస్ ఆడతాడా? లేదా?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు ఆఫ్గాన్ తో సిరీస్, IPL ఆడతాడా? లేదా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు ఆఫ్గాన్ తో సిరీస్, IPL ఆడతాడా? లేదా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

హార్దిక్ పాండ్యా గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న పేరు. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో మెుదటిది ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ అవ్వడం అయితే.. మిగిలిన మరికొన్ని ఉన్నాయి. వాటిల్లో గాయం కారణంగా ఇటు జనవరిలో ఆఫ్గాన్ తో జరిగే టీ20 సిరీస్ తో పాటుగా ఆ తర్వాత జరిగే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న అనుమానం అందరిలో నెలకొంది. కాగా..ఇటీవలే పాండ్యా గాయం నుంచి కోలుకోలేదని, దీంతో ఆఫ్గాన్ తో సిరీస్ కు దూరం అయ్యాడని వార్తలు కూడా వచ్చాయి. వాటితో పాటుగా నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ కు కూడా అందుబాటులో ఉండడని న్యూస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పాండ్యాకు సంబంధించిన ఓ హాట్ హాట్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

హార్దిక్ పాండ్యా ఆఫ్గానిస్తాన్ తో జరిగే 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ తో పాటుగా, ఐపీఎల్ ఆడతాడా? లేడా? అన్న డౌట్ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఉంది. ఇక గాయం నుంచి పాండ్యా పూర్తిగా కోలుకోలేదని, దీంతో అతడు ఈ రెండు టోర్నీలకు దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.. అదేంటంటే? పాండ్యా గాయం నుంచి కోలుకున్నాడని, ఆఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ కి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నాడని జాతీయ మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి.

ఇక ఈ విషయం తెలిసి పాండ్యా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. జనవరిలో జరిగే ఆఫ్గాన్ సిరీస్ కు పాండ్యా సెట్ అయితే.. ఆ తర్వాత జరిగే ఐపీఎల్ కు కూడా అతడు అందుబాటులో ఉంటాడు. అదీకాక ఇటీవలే బయటకి వచ్చిన పాండ్యా గాయం నుంచి పూర్తిగా కొలుకున్నట్లుగానే కనిపిస్తున్నాడు. దీంతో నిన్న మెున్నటి వరకు వచ్చిన వార్తలన్నింటికి చెక్ పెట్టినట్లు అయ్యింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments