iDreamPost
android-app
ios-app

విడాకుల రూమర్స్‌పై స్పందించిన హార్ధిక్‌ భార్య నటాషా! వీడియో రిలీజ్‌..

  • Published Jul 11, 2024 | 4:18 PM Updated Updated Jul 11, 2024 | 4:18 PM

Hardik Pandya, Natasa, Divorce: భారత క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా విడాకులు తీసుకుంటున్నాడు అని వస్తున్న రూమర్స్‌పై అతని భార్య నటాషా తాజాగా ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ఆ వీడియో ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Hardik Pandya, Natasa, Divorce: భారత క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా విడాకులు తీసుకుంటున్నాడు అని వస్తున్న రూమర్స్‌పై అతని భార్య నటాషా తాజాగా ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ఆ వీడియో ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 11, 2024 | 4:18 PMUpdated Jul 11, 2024 | 4:18 PM
విడాకుల రూమర్స్‌పై స్పందించిన హార్ధిక్‌ భార్య నటాషా! వీడియో రిలీజ్‌..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, టీ20 టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌ అయిన హార్ధిక్‌ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కంటే ముందే కొన్ని వార్తలు వైరల్‌ అయ్యాయి. భార్యతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంటున్నాడని, భరణం కింద తన ఆస్తిలో ఏకంగా 70 శాతం ఆమె పేరిట మార్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత.. పాండ్యా తన ఆస్తి మొత్తం తన అమ్మ పేరునే ఉంచినట్లు.. దాంతో భార్య నటాషాకు చిల్లిగవ్వ కూడా దక్కే అవకాశం లేదంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. వాటిపై హార్ధిక్‌ పాండ్యా కానీ, నటాషా కానీ స్పందించలేదు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచినా, భర్త హార్ధిక్‌ పాండ్యా అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టినా.. కనీసం ఆమె ఒక్క పోస్ట్‌ కూడా చేయకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు నిజమే అని చాలా మంది నమ్మారు. అయితే.. తాజాగా నటాషా ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టింది. అందులో విడాకులపై డైరెక్ట్‌గా స్పందించకుండా.. ఇన్‌డైరెక్ట్‌గా తన గురించి నెగిటివ్‌గా మాట్లాడుతున్న వారికి కౌంటర్‌ ఇచ్చింది నటాషా. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత హార్ధిక్‌ పాండ్యాకు మద్దతు పెరగడంతో కొంత మంది నటాషాదే తప్పు అయి ఉంటుందంటూ సోషల్‌ మీడియాలో ఆమెపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

అలాంటి వారికి కౌంటరిస్తూ.. ‘జనాలు ఏమీ తెలియకుండా, తెలుసుకోకుండా ఒకరిని జడ్జ్‌ చేసేస్తూ ఉంటారు. అసలు ఒక సంఘటన వెనుక ఏం జరిగి ఉంటుందో వాళ్లకు తెలియదు. కానీ, డైరెక్ట్‌గా జడ్జ్‌ చేస్తూ.. అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి గురించి ఏదైన పుకారు రాకగానే నిజమో కాదో తెలుసుకోకుండా, కనీసం సానుభూతి చూపించకుండా వారి పాటికి వాళ్లు జడ్జ్‌ చేసేస్తారు. అలాంటి సమయంలో చాలా బాధగా అనిపిస్తుంది’ అంటూ ఆమె వీడియోలో పేర్కొన్నారు. హార్ధిక్‌కి తనకి మధ్య జరిగిన విషయం గురించి ఏం తెలియని వారు కూడా తనదే తప్పు అని జడ్జ్‌ చేస్తున్నారనే విషయంపై ఆమె ఈ విధంగా ఇన్‌డైరెక్ట్‌గా స్పందించి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkazan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş