Somesekhar
నాలుగు నెలల సుదీర్ఘకాలం తర్వాత ఎట్టకేలకు క్రికెట్ లోకి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్. ఆడిన తొలి మ్యాచ్ లోనే కెప్టెన్ గా తన టీమ్ కు అద్భుత విజయాన్ని అందించాడు.
నాలుగు నెలల సుదీర్ఘకాలం తర్వాత ఎట్టకేలకు క్రికెట్ లోకి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్. ఆడిన తొలి మ్యాచ్ లోనే కెప్టెన్ గా తన టీమ్ కు అద్భుత విజయాన్ని అందించాడు.
Somesekhar
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది వరల్డ్ కప్ సందర్భంగా.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన పాండ్యా జట్టుకు దూరంగా ఉంటూ వచ్చాడు. దాదాపు నాలుగు నెలలు టీమిండియాకు దూరమై.. తాజాగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమించిన తర్వాత హార్దిక్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ఇక ఫస్ట్ మ్యాచ్ లోనే బౌలింగ్ లో సత్తాచాటాడు. సారథిగా తన టీమ్ కు తొలి విజయాన్ని అందించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హార్దిక్ పాండ్యా.. గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్ కోసం కసరత్తులు మెుదలుపెట్టిన విషయం మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్-2024లో పాండ్యా రిలయన్స్ 1 టీమ్ కి కెప్టెన్ గా బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో ఏకంగా 16 జట్లు పాల్గొంటున్నాయి. తాజాగా ఫిబ్రవరి 26న బీపీసీఎల్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బీపీసీఎల్ జట్టు 15 ఓవర్లలో 126 పరుగులే చేసింది.
అనంతరం 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రిలయన్స్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి అతి కష్టంమీద గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో పాండ్యా 10వ నెంబర్ బ్యాటర్ గా క్రిజ్ లోకి దిగాడు. బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి 22 రన్స్ ఇచ్చి.. రెండు వికెట్లు తీసి సత్తాచాటాడు. ఇదిలా ఉండగా.. రిలయన్స్ టీమ్ లో తిలక్ వర్మ, పియూష్ చావ్లా, నేహల్ వధేరా లాంటి ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే డొమెస్టిక్ టోర్నీలు వదిలి ఐపీఎల్ కోసం పాండ్యా బ్రదర్స్ తో పాటుగా ఇషాన్ కిషన్ సిద్దమవుతుండటంతో.. బీసీసీఐ వీరిపై సీరియస్ అయ్యింది. దీంతో ఎట్టకేలకు పాండ్యా రీ ఎంట్రీ ఇచ్చాడు. మరి హార్దిక్ రీ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hardik Pandya took 2 wickets for 22 runs from 3 overs in his return to cricket after 4 months.
– Great news for India in the T20 World Cup. 🇮🇳🤞 pic.twitter.com/lG99a3xL1p
— Johns. (@CricCrazyJohns) February 26, 2024
ఇదికూడా చదవండి: సచిన్, విరాట్ లకు సాధ్యం కాలేదు.. బ్రాడ్ మన్ తర్వాత జైస్వాల్ దే ఈ ఘనత!