iDreamPost
android-app
ios-app

Hardik Pandya: విడాకుల తర్వాత.. హార్ధిక్‌ పాండ్యా జీవితంలోకి కొత్త అమ్మాయి?

  • Published Jul 19, 2024 | 10:57 AMUpdated Jul 19, 2024 | 11:08 AM

Hardik Pandya, Prachi Solanki, Natasha: భార్యతో విడాకులు తర్వాత.. టీమిండియా క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా జీవితంలోకి కొత్త అమ్మాయి వచ్చినట్లు సంచలన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Hardik Pandya, Prachi Solanki, Natasha: భార్యతో విడాకులు తర్వాత.. టీమిండియా క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా జీవితంలోకి కొత్త అమ్మాయి వచ్చినట్లు సంచలన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 19, 2024 | 10:57 AMUpdated Jul 19, 2024 | 11:08 AM
Hardik Pandya: విడాకుల తర్వాత.. హార్ధిక్‌ పాండ్యా జీవితంలోకి కొత్త అమ్మాయి?

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్‌ విషయం గురువారం అధికారికంగా తెలిసింది. భార్య నటాషాతో విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరు విడిపోతున్నారని చాలా రోజులుగానే వార్తలు వస్తున్నా.. గురువారం పాండ్యా అధికారిక ప్రకటన చేయడంతో స్పష్టత వచ్చింది. ఈ కఠిన సమయంలో తమకు సపోర్ట్‌గా నిలుస్తూ.. తమకు కాస్త ప్రైవసీ కల్పించాలని పాండ్యా కోరాడు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం హార్ధిక్‌ పాండ్యా విషయంలో మరో సంచలన విషయం అంటూ ఒక ఫొటోను తెగ వైరల్‌ చేస్తున్నారు.

హార్ధిక్‌ పాండ్యా జీవితంలోకి మరో అమ్మాయి వచ్చేసిందంటూ.. పోస్టులు చేస్తున్నారు. హార్ధిక్‌ పాండ్యా ఓ అందమైన అమ్మాయితో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. హార్ధిక్‌ పాండ్యా జీవితం నుంచి నటాషా వెళ్లిపోయన తర్వాత.. ఓ కొత్త అమ్మాయి వచ్చేసిందంటూ చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే.. ప్రముఖ మోడల్‌ కమ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రాచీ సొలంకి. ఈ అమ్మాయి ఇటీవల హార్ధిక్‌ పాండ్యా ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో పాండ్యాతో పాటు కృనాల్‌ పాండ్యా, అతని భార్యతో ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పెట్టింది.

ఆ ఫొటోలే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రాచీ సోలంకి, హార్ధిక్‌ పాండ్యాకు దగ్గర అవ్వడానికి చూస్తోందంటూ కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పాండ్యతో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన సోలంకి.. ‘వరల్డ్‌ కప్‌ హీరోని కలిసినప్పుడు..’ అంటూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. దానికి ఒక అందమైన హిందీ పాటను కూడా జత చేసింది. అయితే.. భార్యతో పాండ్యా విడాకులు తీసుకున్న నేపథ్యంలో అ అమ్మాయి పాండ్యాతో క్లోజ్‌గా ఉంటుండటంతోనే వారి మధ్య ఏమైనా నడుస్తుందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటివి ఏమీ లేవంటూ కొంతమంది పాండ్యా అభిమానులు రూమర్స్‌ను కొట్టిపారేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Prachi Solanki (@ps_29)

 

View this post on Instagram

 

A post shared by Prachi Solanki (@ps_29)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి