iDreamPost
android-app
ios-app

నటాషా- హార్దిక్ పాండ్యా విడాకులు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ..!

  • Published Jul 18, 2024 | 9:21 PM Updated Updated Jul 18, 2024 | 9:33 PM

Hardik Pandya And Natasha Divorce- Hardik Announced In A Emotional Post: హార్దిక్ పాండ్యా- నటాషా విడిపోతున్నారు. వాళ్లు విడాకులు తీసుకుంటున్న విషయాన్ని హార్దిక్ పాండ్యా అధికారికంగా ప్రకటించాడు.

Hardik Pandya And Natasha Divorce- Hardik Announced In A Emotional Post: హార్దిక్ పాండ్యా- నటాషా విడిపోతున్నారు. వాళ్లు విడాకులు తీసుకుంటున్న విషయాన్ని హార్దిక్ పాండ్యా అధికారికంగా ప్రకటించాడు.

  • Published Jul 18, 2024 | 9:21 PMUpdated Jul 18, 2024 | 9:33 PM
నటాషా- హార్దిక్ పాండ్యా విడాకులు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ..!

హార్దిక్ పాండ్యా– నటాషా వైవాహిక జీవితానికి సంబంధించి గత కొన్ని నెలలుగా చాలానే వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరు తమ వివాహ బంధాన్ని ముగిస్తున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలిసున్న పిక్స్ షేర్ చేస్తూ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే నటాషా కూడా అప్పుడప్పుడు భర్తను సపోర్ట్ చేస్తున్నట్లు పోస్టులు పెడుతూ వచ్చింది. గత కొన్నిరోజుల క్రితం అయితే వీళ్లు విడిపోవడం ఖాయం అంటూ గట్టిగానే టాక్ వచ్చింది. కానీ, అప్పుడు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. కానీ, ఇప్పుడు స్వయంగా హార్దిక్ పాండ్యా తన విడాకుల విషయాన్ని వెల్లడించాడు. ఒక ఎమోషనల్ పోస్ట్ రూపంలో తను ఈ విషయాన్ని వెల్లడించాడు.

హార్దిక్ పాండ్యా- నటాషా విడిపోతున్న విషయం ఇప్పటిది కాదు. గత కొన్ని నెలలుగా వారి మధ్య ఏదో జరుగుతోంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వాళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారు అని చాలా మంది ఊహాగానాలు వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అవన్నీ పుకార్లు అనుకుని ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు. కానీ, ఇప్పుడు స్వయంగా హార్దిక్ పాండ్యా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసి తమ విడాకుల విషయాన్ని వెల్లడించాడు. ఆ పోస్ట్ లో నాలుగేళ్ల తమ వైవాహిక బంధాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే తన కుమారుడు అగస్త్య విషయంలో మాత్రం తామిద్దరూ తల్లిదండ్రుల స్థానంలో ఉండి అతని అన్ని అవసరాలు తీరుస్తామంటూ తెలిపాడు.

హార్దిక్ పాండ్యా పోస్టులో.. “నాలుగేళ్లు బంధం తర్వాత నేను- నటాషా విడిపోవాలి అని నిర్ణయించుకున్నాం. మా బంధాన్ని నిలుపుకోవడానికి ఇద్దరం ఎంతో ప్రయత్నించాం. మా బెస్ట్ ఇచ్చాం. అయితే ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది మాకు ఎంతో కఠినమైన నిర్ణయం. ఇద్దరం కలిసి ఎంతో ఆనంద క్షణాలను అనుభవించాం.. ఒకరినొకం ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాం.. మేము ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాం. మా జీవితాల్లోకి అగస్త్య వచ్చాడు. అగస్త్య మా జీవితాలకు మూలం. మేమిద్దరం కలిసి అగస్త్య బాగోగులు చూసుకుంటాం. అతను ఆనందంగా ఉండేలా చూసుకుంటాం. మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాం” అంటూ హార్దిక్ పాండ్యా పోస్ట్ లో చెప్పుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio