SNP
Hardik Pandya, Suryakumar Yadav: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను.. మాజీ వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అవమానించినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..
Hardik Pandya, Suryakumar Yadav: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను.. మాజీ వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అవమానించినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ టీమిండియా లంకకు వెళ్లింది. ఈ నెల 22న భారత జట్టు లంక గడ్డపై అడుగుపెట్టి.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ జట్టుతో కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు. సోమవారం లంకకు చేరుకున్న టీమిండియా.. నెక్ట్స్ డేనే తొలి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు, అలాగే పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే తొలి ప్రాక్టీస్ సెషన్.
అయితే.. స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా శ్రీలంకలో కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అవమానించినట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త కెప్టెన్‌గా తొలి ప్రాక్టీస్ సెషన్‌కి ముందు సూర్యకుమార్ యాదవ్ నిర్వహించిన టీమ్ హుడిల్‌కి హార్ధిక్ పాండ్యా రాలేదంటా.. తన స్థానంలో కెప్టెన్సీ తీసుకున్న సూర్య నిర్వహించే టీమ్ హుడిల్‌లో పాల్గొనడం ఏంటంటూ.. డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తొలి ప్రాక్టీస్ సెషన్‌కి ముందు నిర్వహించిన హుడిల్‌లో పాండ్యా పాల్గొనకపోయినా.. తర్వాత ప్రాక్టీస్‌కి వచ్చాడు. కొత్త హెడ్ కోచ్ గంభీర్‌తో తన బ్యాటింగ్ టెక్నిక్స్ గురించి చర్చించి.. అనంతరం బ్యాటింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత చివర్లో మరోసారి నిర్వహించిన టీమ్ మీటింగ్‌లో పాండ్యా పాల్గొన్నాడు. కెప్టెన్ సూర్య మాట్లాడుతుంటే.. పక్కన ఉండి విన్నాడు. కానీ, ఉదయం జరిగిన టీమ్ హుడిల్‌లో ఎందుకు పాల్గొనలేదో కారణం తెలియరాలేదు. అయితే.. రోహిత్ శర్మ తర్వాత టీ20 కెప్టెన్ పాండ్యా అవుతాడని అంతా భావించారు. కానీ, చివరి నిమిషంలో సూర్య కెప్టెన్ అయ్యాడు. ఈ విషయంపై పాండ్యా కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 𝗚𝗮𝘂𝘁𝗮𝗺 𝗚𝗮𝗺𝗯𝗵𝗶𝗿 𝗧𝗮𝗸𝗲𝘀 𝗖𝗵𝗮𝗿𝗴𝗲! 💪#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/sbG7VLfXGc
— BCCI (@BCCI) July 23, 2024