Hardik Pandya Made Us Proud Elena Tuteja: హార్దిక్​పై రష్యన్ మోడల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. గర్వపడేలా చేశావంటూ..!

Hardik Pandya: హార్దిక్​పై రష్యన్ మోడల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. గర్వపడేలా చేశావంటూ..!

వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యాను ఇప్పుడు అంతా సూపర్ స్టార్​లా చూస్తున్నారు. మెగాటోర్నీతో అతడి మీద ఉన్న నెగెటివిటీ మొత్తం పోయి.. ఫుల్ పాజిటివిటీ వచ్చేసింది.

వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యాను ఇప్పుడు అంతా సూపర్ స్టార్​లా చూస్తున్నారు. మెగాటోర్నీతో అతడి మీద ఉన్న నెగెటివిటీ మొత్తం పోయి.. ఫుల్ పాజిటివిటీ వచ్చేసింది.

వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యాను ఇప్పుడు అందరూ సూపర్ స్టార్​లా చూస్తున్నారు. మెగాటోర్నీతో అతడి మీద ఉన్న నెగెటివిటీ పోయి.. ఫుల్ పాజిటివిటీ వచ్చేసింది. పొట్టి కప్పు ఫైనల్ మ్యాచ్​తో అతడు సూపర్ స్టార్​గా మారిపోయాడు. అలాగని పాండ్యాకు ముందు నుంచి క్రేజ్ లేదని కాదు. గత కొన్నేళ్లుగా భారత జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తూ మంచి పాపులారిటీ సంపాదించాడు హార్దిక్. అయితే ఐపీఎల్-2024 టైమ్​లో భారీగా విమర్శలు ఎదుర్కోవడం, ట్రోలింగ్​కు గురవడంతో అభిమానుల్లో అతడి మీద నెగెటివిటీ పెరిగింది. కానీ టీ20 ప్రపంచ కప్​లో బ్యాట్​తో, బాల్​తో సత్తా చాటడం.. ఫైనల్ ఫైట్​లో క్లాసెన్, మిల్లర్​ను ఔట్ చేసి మ్యాచ్​ను టీమిండియా వైపు తిప్పడంతో హార్దిక్​ క్రేజ్ డబుల్ అయింది. అతడ్ని అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

భారత్ కప్పు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్​ను అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సూపర్బ్​గా ఆడావంటూ మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో ఓ రష్యన్ మోడల్, నటి అతడ్ని పొగిడింది. మమ్మల్ని గర్వించేలా చేశావంటూ కామెంట్ చేసింది. ఆమె పేరు ఎలెనా టుటేజా. భారతీయులంతా టీమిండియా విజయంపై ఎంతో గర్వపడుతున్నారని ఆమె తెలిపింది. హార్దిక్​తో తనకు మంచి అనుబంధం ఉందని.. ఇద్దరమూ కలసి గతంలో ఓ యాడ్ షూట్​లో పాల్గొన్నామంటూ దానికి సంబంధించిన ఓ ఫొటోను ఆమె షేర్‌‌ చేసింది. భారత జట్టుతో పాటు పాండ్యా కూడా తమను గర్వపడేలా చేశాడని ఈ పోస్ట్​కు ఆమె క్యాప్షన్ జత చేసింది. ఎలెనా ఇన్​స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్​గా మారింది.

ఎలెనా పోస్ట్ చూసిన కొందరు నెటిజన్స్.. హార్దిక్​కు ఆమెకు మధ్య ఎఫైర్ నడుస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్​గా పాండ్యా గురించి పోస్ట్ పెట్టిందంటే వాళ్ల మధ్య ఏదో నడుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి వచ్చిన హార్దిక్.. ఆ విజయాన్ని కొడుకు అగస్త్యతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. కుమారుడ్ని హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ సెలబ్రేషన్స్​లో పాండ్యా భార్య నటాషా లేకపోవడం చర్చకు దారితీసింది. వీళ్లిద్దరూ విడిపోయారనడానికి ఇదే నిదర్శనమని నెటిజన్స్ అంటున్నారు. ఇదే తరుణంలో హార్దిక్​తో కలసి దిగిన యాడ్ షూట్ ఫొటోను మోడల్ ఎలెనా పోస్ట్ చేయడంతో వాళ్లిద్దరూ రిలేషన్​లో ఉన్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి. కెరీర్ పరంగా హ్యూజ్ సక్సెస్​తో అందరితో ప్రశంసలు అందుకుంటున్న హార్దిక్.. పర్సనల్ లైఫ్​ వల్ల మాత్రం పదే పదే వార్తల్లో నిలుస్తున్నాడు.

Show comments