Nidhan
Hardik Pandya, BCCI, Team India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఓన్లీ టీ20ల్లోనే కనిపిస్తున్నాడు. పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత శ్రీలంక టూర్‌కు వెళ్లిన పాండ్యా.. అక్కడ కేవలం టీ20 సిరీస్‌కే పరిమితమయ్యాడు.
Hardik Pandya, BCCI, Team India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఓన్లీ టీ20ల్లోనే కనిపిస్తున్నాడు. పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత శ్రీలంక టూర్‌కు వెళ్లిన పాండ్యా.. అక్కడ కేవలం టీ20 సిరీస్‌కే పరిమితమయ్యాడు.
Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య కేవలం టీ20ల్లోనే కనిపిస్తున్నాడు. పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత శ్రీలంక టూర్‌కు వెళ్లిన పాండ్యా.. అక్కడ కేవలం టీ20 సిరీస్‌కే పరిమితమయ్యాడు. వన్డే సిరీస్‌కు అతడ్ని సెలెక్ట్ చేయలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు కూడా అతడ్ని ఎంపిక చేయలేదు. పాండ్యాకు ఏ గాయమూ లేదు. అతడు ఫిట్‌గానే ఉన్నాడు. అయినా నేషనల్ డ్యూటీకి దూరంగా ఉంచారు. భారత స్టార్లంతా ఆడిన దులీప్ ట్రోఫీకీ అతడ్ని ఎంపిక చేయలేదు. దీంతో పాండ్యాను ఇక మీదట ఒకే ఫార్మాట్‌కు పరిమితం చేస్తారా? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ల డౌట్స్‌కు ఫుల్స్టాప్ పెట్టింది భారత క్రికెట్ బోర్డు. హార్దిక్‌కు బీసీసీఐ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
వన్డేలకు, టెస్టులకు దూరంగా ఉంటున్న పాండ్యాను అక్టోబర్ 11 నుంచి మొదలయ్యే రంజీ ట్రోఫీలో ఆడాల్సిందిగా బీసీసీఐ ఆదేశించిందని తెలుస్తోంది. డొమెస్టిక్ సీజన్ 2024-25లో పాల్గొని ఫామ్, ఫిట్నెస్ను నిరూపించుకోవాలని సూచించిందట. ముఖ్యంగా బౌలింగ్ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవాలని తెలిపిందట. లాంగ్ స్పెల్స్ వేయడంపై ఫోకస్ చేయాలని బోర్డు పెద్దలు స్టార్ ఆల్‌రౌండర్‌కు చెప్పినట్లు సమాచారం. రంజీ ట్రోఫీలో రాణిస్తే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌తో పాటు ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ అతడ్ని ఆడించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ విషయాన్ని హార్దిక్ డొమెస్టిక్ టీమ్‌కు చెందిన బరోడా క్రికెట్ అసోసియేషన్‌లోని ఓ సీనియర్ అధికారి కన్ఫర్మ్ చేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక, లంక సిరీస్‌కు మొదలవడానికి ముందు టీమిండియా టీ20 టీమ్‌కు కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ రేసులో హార్దిక్ ఉన్నా.. అతడి ఫిట్నెస్ ఇష్యూస్‌ను పరిగణనలోకి తీసుకొని కెప్టెన్సీ ఇవ్వలేదని స్వయంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఇదే సాకు చూపి లంకతో వన్డే సిరీస్‌కు అతడ్ని ఎంపిక చేయలేదు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేస్తే ఇంజ్యురీ బారిన పడే రిస్క్ ఉందంటూ వన్డేలతో పాటు టెస్టులకూ పక్కనబెట్టారు. అయితే పట్టువదలకుండా ఫిట్నెస్ పెంచుకోవడంపై పనిచేసిన హార్దిక్ ఇప్పుడు ఆ విషయంలో బెటర్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రంజీ సీజన్లో ఆడి బౌలింగ్, బ్యాటింగ్‌లో ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకోమని బీసీసీఐ నుంచి ఇండికేషన్స్ వెళ్లాయట. ఇది తెలిసిన నెటిజన్స్ అతడి కష్టం వృథా పోలేదని.. టెస్ట్ కమ్‌బ్యాక్ త్వరలోనే ఉంటుందని అంటున్నారు. మరి.. హార్దిక్‌ను తిరిగి లాంగ్ ఫార్మాట్లో చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
🚨 HARDIK PANDYA IN THE MIX FOR TEST RETURN 🚨
– He has been asked to play in the Ranji Trophy. [Sports Tak] pic.twitter.com/l0nde2WpCX
— Johns. (@CricCrazyJohns) September 20, 2024