Natasha: హార్ధిక్‌ పాండ్యా మాజీ భార్య నటాషాకు ఎంత ఆస్తి ఉందో తెలిస్తే షాక్‌ అవుతారు!

Hardik Pandya, Natasha: స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు విడాకులు ఇచ్చిన మాజీ భార్య నటాషాకు భరణం వస్తుందా? రాదా? వస్తే ఆమె ఆస్తులు ఎంత పెరుగుతాయి? రాకుంటే ఎ‍ంత ఉంటాయి? ఈ ఆసక్తికర విషయాల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hardik Pandya, Natasha: స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు విడాకులు ఇచ్చిన మాజీ భార్య నటాషాకు భరణం వస్తుందా? రాదా? వస్తే ఆమె ఆస్తులు ఎంత పెరుగుతాయి? రాకుంటే ఎ‍ంత ఉంటాయి? ఈ ఆసక్తికర విషయాల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా, ప్రముఖ మోడల నటాషా తమ నాలుగేళ్ల వివాహబంధానికి ముగింపు పలికి విడాకులు తీసుకున్నారు. తాము విడిపోతున్నాం అంటూ గురువారం అధికారిక ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హార్ధిక్‌ పాండ్యా, తన మాజీ భార్య నటాషాకు ఎంత భరణం ఇచ్చాడు? ఒక్కగానొక్క కొడుకు అగస్త్యా ఎవరి వద్ద ఉంటాడు? అనే విషయాలపై క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయాలపై ఇప్పటి వరకు ఉన్న సమాచారంతో వీలైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

టీమిండియా క్రికెటర్‌గా హార్ధిక్‌ పాండ్యా సంపాదన కోట్లలో ఉంది. అలాగే క్రికెటర్‌గా తనకొచ్చిన ఫేమ్‌ అండ్‌ నేమ్‌తో పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటూ కూడా పాండ్యా కోట్లలో సంపాదిస్తున్నాడు. మొత్తంగా హార్ధిక్‌ పాండ్యా నెట్‌వర్త్‌ రూ.91 నుంచి 100 కోట్లుగా ఉంది. క్రికెట్‌ ద్వారా వచ్చేదే కాకుండా.. బ్రాండ్‌ ఎండార్సింగ్‌ కోసం ఒక్కో యాడ్‌కు పాండ్యా రూ.కోటి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా మొత్తం కలిపి అతని నికర ఆస్తుల విలువ రూ.91 నుంచి 100 కోట్లుగా ఉంది. ఇక వేళ అందులోంచి తన మాజీ భార్య నటాషాకు భరణం చెల్లిస్తే.. హార్ధిక్‌ పాండ్యా నెట్‌ వర్క్‌ వ్యాల్యూ భారీ తగ్గనుంది.

ఇక నటాషా విషయానికి వస్త.. హార్ధిక్‌ పాండ్యాను పెళ్లి చేసుకోకముందే ఆమె ఒక మోడల్‌. సెర్బియాకు చెందిన నటాషాకు కూడా భారీనే ఆస్తులు ఉన్నాయి. ఆమె నెట్‌ వర్త్‌ అంత కాకపోయినా.. రూ.20 నుంచి 25 కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం. ఇక వేళ హార్ధిక్‌ పాండ్యాను ఆమె భరణం పొంది ఉంటే.. ఆమె ఆస్థుత నికర విలువ భారీగా పెరగనుంది. రూ.20 కోట్ల నుంచి ఏకంగా రూ.70 కోట్ల ఆస్తికి ఆమె ఓనర్‌ అయ్యే అవకాశం ఉంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోయారు కాబట్టి.. భరణం రాకున్నా.. తాను సొంతంగా సంపాదించుకున్న రూ.20 కోట్ల నికర ఆస్తులతో కూడా నటాషా మంచి లైఫ్‌ను లీడ్‌ చేయగలదు. ఇక పాండ్యా-నటాషా కుమారుడు అగస్త్యా ప్రస్తుతం తల్లితోనే ఉండనున్నాడు. అయితే.. అతనికి అవసరమ అయ్యే ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులిద్దరూ కూడా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. మరి నటాషా ఆస్తులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments