Nidhan
టీ20 ప్రపంచ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకోవడంతో భారత క్రికెటర్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హార్దిక్ మరింత ఉత్సాహంలో ఉన్నాడు.
టీ20 ప్రపంచ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకోవడంతో భారత క్రికెటర్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హార్దిక్ మరింత ఉత్సాహంలో ఉన్నాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో చాలా మంది పాత్ర ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి ఇతర బ్యాటర్లు, బౌలర్ల రోల్ ఎంతో ఉంది. అందరూ కలసికట్టుగా రాణిస్తేనే మెగాటోర్నీ నెగ్గి విశ్వవిజేతగా ఆవిర్భవించింది భారత్. అయితే అందరికంటే ఎక్కువ క్రెడిట్ మాత్రం హార్దిక్ పాండ్యా కొట్టేశాడు. ఐపీఎల్-2024 టైమ్‌లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడీ ఆల్‌రౌండర్. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం కారణంగా అతడిపై దారుణంగా ట్రోలింగ్ నడిచింది. ఐపీఎల్ మ్యాచుల సమయంలో బూ.. అంటూ పాండ్యాను ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. అయినా అతడు అవేవీ పట్టించుకోలేదు. కానీ అటు బ్యాటర్‌గా, ఇటు బౌలర్‌గా హార్దిక్ ఫ్లాప్ షో నడవడంతో అతడ్ని వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోవద్దనే డిమాండ్లు వచ్చాయి.
ఎవరెన్ని విమర్శలు చేసినా హార్దిక్ ఆటతీరు ఏంటో తెలిసిన బీసీసీఐ అతడికి మద్దతుగా నిలిచింది. పొట్టి కప్పుకు అతడ్ని సెలెక్ట్ చేయడమే గాక వైస్ కెప్టెన్‌గా బాధ్యతల్ని అప్పగించింది. ఆ నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టుకున్నాడు. వరల్డ్ కప్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. సౌతాఫ్రికాతో జరిగిన మెగాఫైనల్లో కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి భారత్‌కు కప్పును అందించాడు. అప్పటిదాకా విమర్శకులకు టార్గెట్ అవుతూ వచ్చిన హార్దిక్.. ఒక్క టోర్నమెంట్‌తో ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా అతడికి సారీ చెబుతూ.. నువ్వు గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు. దీంతో హార్దిక్ అభిమానుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది. ఈ తరుణంలో వాళ్లకు మరో గుడ్ న్యూస్.
టీ20 వరల్డ్ కప్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన పాండ్యా.. ఇప్పుడు నంబర్ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో అతడు అతడు నంబర్ వన్ ఆల్‌రౌండర్ స్థానాన్ని దక్కించుకున్నాడు. అతడి తర్వాతి ప్లేసుల్లో వనిందు హసరంగా (శ్రీలంక), మార్కస్ స్టొయినిస్ (ఆస్ట్రేలియా), సికందర్ రజా (జింబాబ్వే), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) నిలిచారు. ప్రపంచ కప్‌లో 8 మ్యాచుల్లో కలిపి 144 పరుగులు చేసిన పాండ్యా.. 11 వికెట్లు తీశాడు. అతడి ర్యాంకింగ్ ఘనత గురించి తెలిసిన పాండ్యా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. హార్దిక్‌కు ఎదురులేదని అంటున్నారు. ఐపీఎల్లో విజేతగా నిలవడం కాదు.. వరల్డ్ కప్ విన్నర్‌గా నిలవడం గ్రేట్ అచీవ్మెంట్ అని అంటున్నారు. ఇది 10 ఐపీఎల్ ట్రోఫీలకు సమానమని చెబుతున్నారు. ఇక మీదట హార్దిక్‌కు ఢోకా లేదని.. అతడేం పట్టుకున్నా బంగారం అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. హార్దిక్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా అవతరించడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Hardik Pandya has become the top-ranked all-rounder in the latest ICC Men’s T20I Rankings#ICCRankings | Read: https://t.co/DEr9c9tGdv pic.twitter.com/HVwAxu7HSI
— Sportstar (@sportstarweb) July 3, 2024