World Cup 2023: పాక్‌ ఓటమిపై భజ్జీ అసహనం! తప్పుడు నిర్ణయాలంటూ మండిపాటు

వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనూ పాక్‌ ఓటమి పాలైంది. దీంతో వారి సెమీస్‌ అవకాశాలు దాదాపు గల్లంతు అయ్యాయి. అయితే.. పాక్‌ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ భజ్జీ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. వారి తప్పిదం కారణంగా పాక్‌ ఓడిందని అంటున్నారు. ఆ తప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనూ పాక్‌ ఓటమి పాలైంది. దీంతో వారి సెమీస్‌ అవకాశాలు దాదాపు గల్లంతు అయ్యాయి. అయితే.. పాక్‌ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ భజ్జీ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. వారి తప్పిదం కారణంగా పాక్‌ ఓడిందని అంటున్నారు. ఆ తప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా శుక్రవారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో పాకిస్థాన్‌-సౌతాఫ్రికా మధ్య హోరాహోరీ పోరు జరిగింది. సెమీస్‌ రేసులో నిలవాలంటే.. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలుపు అంచుల దాకా వెళ్లి ఒక్క వికెట్‌ తేడాతో ఓటమి పాలైంది. దీంతో పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓటమికి అంపైర్‌ తప్పుడు నిర్ణయాలు, ఐసీసీ చెత్త నిర్ణయాలే కారణమని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ చివర్లో హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్‌ షంషీ ఎల్బీడబ్ల్యూ అవుట్‌ కోసం పాక్‌ టీమ్‌ అప్పీల్‌ చేసింది.

దాన్ని అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయినా కూడా బాబర్‌ అజమ్‌ రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో బాల్‌ పిచ్‌ ఇన్‌ లైన్‌, ఇప్యాక్ట్‌ ఇన్‌ ఇన్‌ లైన్‌ అయి వికెట్లను తాకింది. కానీ, అది లెగ్‌ స్టంప్‌ కావడంతో అంపైర్స్‌కాల్‌ కింద దాన్ని నాటౌట్‌గా ప్రకటించారు. అంపైర్‌ అవుట్‌ ఇచ్చి ఉంటే ఆ వికెట్‌ పాకిస్థాన్‌కు దక్కేదే, మ్యాచ్‌ గెలిచే వాళ్లే కానీ, అంపైర్స్‌ కాల్‌ వాళ్ల కొంపముంచింది. ఇదే విషయంపై స్పందించిన హర్భజన్‌సింగ్‌.. అంపైర్‌ నిర్ణయానికి అంత ఇంపార్టెంట్స్‌ ఇస్తే.. ఇంక టెక్నాలజీ ఎందుకని, నమ్మితే టెక్నాలజీని నమ్మండి, లేదా అంపైర్‌ను నమ్మండి అంటూ ఘాటుగా స్పందించాడు. అయితే.. అంపైర్స్‌ కాల్స్‌ ఎందుకు అంత ప్రాముఖ్యమో.. వివరిస్తూ.. గతంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ నాసిర్‌ హుస్సేన్‌ ఓ వీడియో చేశారు. అది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

దానిపై కూడా స్పందించిన హర్భజన్‌ సింగ్‌.. టెక్నాలజీనే కరెక్ట్‌ అని చెప్పేందకు కొంతమంది డబ్బులు తీసుకుంటారని, ఎందుకంటే టెక్నాలజీ ఎంత ముఖ్యమో చెప్పడం కోసం టెక్ కంపెనీ కచ్చితంగా బ్రాడ్‌కాస్టర్‌కు డబ్బులు ముట్టజెప్పి ఉంటుందని ఒకవేళ టెక్నాలజీ సరైందే అయితే దాన్నే అనుసరించాలని పేర్కొన్నాడు. అలా కాదని అంపైర్ల నిర్ణయం దేనికి..? ఇదంతా నాన్‌సెన్స్.. అంటూ కొట్టిపారేశాడు. అయితే.. కొంతమంది భజ్జీ వాదనను వ్యతిరేకిస్తున్నారు. అంపైర్స్‌ కాల్‌ గురించి భజ్జీకి ప్రముఖ కామెంటేటర్‌ హర్ష భోగ్లే వివరించే ప్రయత్నం చేసినా భజ్జీ వినలేదు. అలాగే కొంతమంది క్రికెట్‌ అభిమానులు సైతం సౌతాఫ్రికా బ్యాటర్‌ డసెన్‌ సైతం అలాగే అంపైర్స్‌కాల్‌కు అవుట్‌ అయ్యాడని మరి దాని గురించి కూడా మాట్లాడలని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments