iDreamPost
android-app
ios-app

భారతీయ సంప్రదాయంలో మాక్స్ వెల్ భార్య సీమంతం! వైరలవుతున్న ఫోటోలు

  • Author Soma Sekhar Published - 03:37 PM, Mon - 24 July 23
  • Author Soma Sekhar Published - 03:37 PM, Mon - 24 July 23
భారతీయ సంప్రదాయంలో మాక్స్ వెల్ భార్య సీమంతం! వైరలవుతున్న ఫోటోలు

ప్రపంచంలో ఎన్నో సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. సనతాన హిందూ సంప్రదాయానికి ఉన్న ప్రత్యేకతే వేరు. అందుకు వరల్డ్ వైడ్ గా హిందూ సంప్రదాయాన్ని ఆచరించడానికి మెుగ్గు చూపుతున్నారు విదేశీయులు. అందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వివిధ వేడుకల్లో భారతీయత ఉట్టిపడేలా కట్టూ, బొట్టుతో ప్రపంచ వేదికలపై ఇండియన్ కల్చర్ ను రిప్రజెంట్ చేశారు. తాజాగా ఆసీస్ స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్ తన భార్య విని రామన్ సీమంతాన్ని భారతీయత సంస్కృతి ఉట్టిపడేలా చీర కట్టులో వేడుకను ఘనంగా నిర్వహించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గ్లెన్ మాక్స్ వెల్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఆటగాడిగా తనకంటూ ఓ పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ ద్వారా భారతీయ అభిమానులను సంపాదించుకున్నాడు మాక్సీ. ఈ క్రమంలోనే భారతీయ సంప్రదాయాలు మాక్సీని విశేషంగా ఆకట్టుకున్నాయి. మాక్సీతో పాటుగా ఇతర విదేశీ ఆటగాళ్లకు ఇండియన్ కల్చర్ అంటే అమితమైన గౌరవం, ఇష్టం. కాగా.. మాక్స్ వెల్ ఒక్క అడుగు ముందుకు వేసి.. తన భార్య సీమంతాన్ని భారతీయత ఉట్టిపడే విధంగా చీరకట్టులో నిర్వహించాడు.

మాక్స్ వెల్ భార్య విని రామన్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. తన భార్య సీమంతపు వేడుకును ఎంతో ఘనంగా నిర్వహించాడు. అచ్చమైన చీరకట్టు, బొట్టులో మహాలక్ష్మిలా ఉంది మాక్సీ భార్య. బ్లెస్సింగ్ బేబీ మాక్స్ వెల్ ది ట్రెడిషనల్ వే అటూ విని రామన్ తన ఇన్ స్టాలో పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇండియన్ కల్చర్ కు పెద్దపీట వేస్తూ.. తన భార్య సీమంతాన్ని జరిపిన మాక్స్ వెల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss