బిగ్‌ బ్రేకింగ్‌: మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరం!

సెమీస్‌కు చేరాలంటే రానున్న మ్యాచ్‌ల్లో గెలవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సెమీస్‌ బెర్త్‌ కోసం గట్టి పోటీనే నెలకొంది. ఇలాంటి సమయంలో ఆసీస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ గాయపడ్డాడు.

సెమీస్‌కు చేరాలంటే రానున్న మ్యాచ్‌ల్లో గెలవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సెమీస్‌ బెర్త్‌ కోసం గట్టి పోటీనే నెలకొంది. ఇలాంటి సమయంలో ఆసీస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ గాయపడ్డాడు.

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. దీంతో వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా ఈ నెల 4న ఇంగ్లండ్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు మ్యాక్సీ దూరం అయ్యాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ గెలిచిన తర్వాత.. తిరిగి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ మధ్య వారంపాటు సమయం ఉండటంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా సరదాగా గడపుతున్నారు. దొరికిన ఈ ఖాళీ సమయంలో మ్యాక్స్‌వెల్‌ గోల్ఫ్‌ ఆడేందుకు వెళ్లాడు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో గాయపడినట్లు సమాచారం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది.

కాగా, ఈ ఏడాదిలోనే మ్యాక్స్‌వెల్‌ రెండో సారి గాయపడ్డాడు. ఇంతకుముందు ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి అక్కడ కిందపడి మ్యాక్స్‌వెల్‌ గాయాలపాలయ్యాడు. ఇప్పుడు కూడా అదే గాయం మరింత తిరగబెట్టిందని సమాచారం. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మ్యాక్స్‌వెల్‌ కీలక ఆటగాడిగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఆసీస్‌ సెమీస్‌ చేరాలంటే రానున్న మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలతో ఉంది ఆస్ట్రేలియా. ఇంగ్లండ్‌తో ఆసీస్‌ 4వ తేదీ రోజు మ్యాచ్‌ ఆడనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ మంచి ఫామ్‌లో లేకపోయినా.. ఆ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. ఆ విషయం ఆస్ట్రేలియాకు కూడా బాగా తెలుసు.

ఇలాంటి పరిస్థితుల్లో మ్యాక్స్‌వెల్‌ లాంటి స్టార్‌ ఆటగాడు గాయపడటం ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే.. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో మ్యాక్సీ ఆసీస్‌కు ప్లస్‌పాయింట్‌గా మారాడు. మిడిల్‌ ఓవర్స్‌లో తన స్పిన్‌ బౌలింగ్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే ఇండియన్‌ పిచ్‌లపై మ్యాక్స్‌వెల్‌, మరో స్పిన్నర్‌ ఆడమ్‌ జ​ంపాతో కలిసి ఆసీస్‌కు బలంగా మారాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు మ్యాక్స్‌వెల్‌. ఇటీవల వరల్డ్‌ కప్‌ హిస్టరీలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ కూడా బాదేశాడు. ఇంత మంచి ఫామ్‌లో ఉండి, టీమ్‌ సెమీస్‌కు చేరువ అవుతున్న సమయంలో మ్యాక్స్‌వెల్‌ గాయపడటం నిజంగా ఆసీస్‌కు భారీ దెబ్బ. మరి మ్యాక్సీకి గాయం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments