ఇండియన్ క్రికెట్ కోసం ఓ డేల్ స్టెయిన్‌ని సిద్ధం చేస్తున్న గంభీర్! ఆ బౌలర్ ఎవరో తెలుసా?

Gautam Gambhir, IND vs SL, Dale Steyn: శ్రీలంకతో సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్ల విషయంలో ఒక్క విషయంలో గంభీర్‌ తన పట్టుదలను నెగ్గించుకున్నాడు. టీమిండియాకు ఓ డేల్‌ స్టెయిన్‌ రెడీ చేసే క్రమంలో ఓ బౌలర్‌ను టీమ్‌లోకి తీసుకున్నాడు. అతను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir, IND vs SL, Dale Steyn: శ్రీలంకతో సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్ల విషయంలో ఒక్క విషయంలో గంభీర్‌ తన పట్టుదలను నెగ్గించుకున్నాడు. టీమిండియాకు ఓ డేల్‌ స్టెయిన్‌ రెడీ చేసే క్రమంలో ఓ బౌలర్‌ను టీమ్‌లోకి తీసుకున్నాడు. అతను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

అనుకున్నట్లుగానే గౌతమ్‌ గంభీర్‌ ఇండియన్‌ క్రికెట్‌పై తన మార్క్‌ చూపిస్తున్నాడు. హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ వచ్చిన తర్వాత.. ‍టీమిండియాలో ఊహించని మార్పులు జరుగుతాయని క్రికెట్‌ అభిమానులు ముందుగానే భావించారు. హెడ్‌ కోచ్‌గా నియామకం అయి.. ఇంకా ఫీల్డ్‌లోకి దిగకముందే.. గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా తన ముద్ర వేస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్ల విషయంలో గంభీర్‌ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. టీ20 జట్టు కెప్టెన్సీని హార్ధిక్‌ పాండ్యాకు కాకుండా సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇవ్వడం, వైస్‌ కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ను నియమించడం, వన్డేల్లో కూడా అతనికే వైస్‌ కెప్టెన్సీ ఇవ్వడంలో గంభీర్‌ హస్తం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీటితో పాటు టీమిండియాను పేస్‌ బౌలింగ్‌లో మరింత పటిష్టం చేసేందుకు గంభీర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టుకు డేల్‌ స్టెయిన్‌ లాంటి ప్లేయర్‌ను అందించడమే లక్ష్యంగా గౌతీ ఒక సూపర్‌ బౌలర్‌ను ఎంపిక చేయించాడు.

శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు భారత స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు భారత సెలెక్టర్లు రెస్ట్‌ ఇచ్చారు. అయితే.. ఓ యువ బౌలర్‌ను గంభీర్‌ సూచన మేరకు మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేశారు. ఆ బౌలర్‌ ఎవరో కాదు.. ఐపీఎల్‌ 2024 అదరగొట్టిన హర్షిత్‌ రాణా. అద్భుతమైన స్పీడ్‌తో పాటు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంత్‌తో ఐపీఎల్‌లో సత్తాచాటిన హర్షిత్‌ రాణాను.. జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు ఎంపిక చేసినా.. అతనికి ప్లేయింగ్‌లో ఆడే అవకాశం రాలేదు. కానీ, శ్రీలంకతో వన్డే సిరీస్‌కు మాత్రం అతన్ని కచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అని పట్టుబట్టి మరీ టీమ్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్‌ జట్టు పేస్‌ బౌలింగ్‌లో ఎక్కువగా బుమ్రాపైనే ఆధారపడుతోంది. సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌ ఉన్నా వాళ్లు రెగ్యులర్‌గా ఒకే విధమైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. మొహమ్మద్‌ షమీ ఉన్నా గాయాలు అతనికి శాపంగా మారాయి. అందుకే గంభీర్‌ పేస్‌ బౌలింగ్‌పై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌లో ఆడుతూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన హర్షిత్‌ రాణాపై మరింత ఫోకస్‌ పెట్టి, అతన్ని మరింత రాటుదేల్చి.. టీమిండియాకు అతన్ని ఓ డేల్‌ స్టెయిన్‌ని చేయాలనే ప్లాన్‌లో హెడ్‌ కోచ్‌ గంభీర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో అతనికి అవకాశాలు ఇచ్చి.. టెస్టుల్లో అతని సేవలు ఉపయోగించుకోవాలని గంభీర్‌ భావిస్తున్నాడు.

ఐపీఎల్‌ 2024లో 13 మ్యాచ్‌లు ఆడిన హర్షిత్‌ రాణా ఏకంగా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్‌ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. పైగా కేకేఆర్‌ మెంటర్‌గా పనిచేసిన క్రమంలో గంభీర్‌.. రాణాపై ఎంతో శ్రమించాడు. దాన్ని మరింత పెంచి.. అతన్ని ఓ అద్భుతంగా బౌలర్‌గా మార్చి టీమిండియాకు గిఫ్ట్‌ ఇవ్వాలని గౌతీ గట్టి పట్టుదలతో ఉన్నాడు. గంభీర్‌ అనుకున్నట్లు జరిగితే.. టీమిండియాకు డేల్‌ స్టెయిన్‌ లాంటి బౌలర్‌ దొరికినట్లే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments