SNP
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు ధోని అంటే పడదు అనే విషయం అందరికి తెలిసిందే. చాలా సార్లు ధోనిపై విమర్శలు చేసిన గంభీర్.. తాగా వరల్డ్ కప్ 2023లో ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మ్యాచ్‌లో ధోనిపై సెటైర్లు వేశాడు. మరి గంభీర్ ఎందుకు అలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు ధోని అంటే పడదు అనే విషయం అందరికి తెలిసిందే. చాలా సార్లు ధోనిపై విమర్శలు చేసిన గంభీర్.. తాగా వరల్డ్ కప్ 2023లో ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మ్యాచ్‌లో ధోనిపై సెటైర్లు వేశాడు. మరి గంభీర్ ఎందుకు అలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు ఫుల్ వినోదాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో మూడు సంచనాలు నమోదు అయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి పెద్ద టీమ్స్‌ను ఓడించి.. భారీ షాకిచ్చింది. అలాగే నెదర్లాండ్స్ టీమ్ సౌతాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదు అవుతున్నా.. కొన్ని పెద్ద టీమ్స్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. కానీ, ఓ రెండు పెద్ద టీమ్స్ మాత్రం దారుణ ఓటములు చవిచూస్తున్నాయి. అందులో ఒకటి ఇంగ్లండ్. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ఓటమి పాలై.. దాదాపు సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. అయితే.. ఈ మ్యాచ్ సందర్భంగా.. గౌతమ్ గంభీర్.. టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని పరోక్షంగా విమర్శించారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అయిన గంభీర్.. ప్రస్తుతం వరల్డ్ కప్ టోర్నీలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్-శ్రీలంక మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. జట్టులోని ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకుంటే.. కెప్టెన్ మాత్రం ఏం చేస్తాడు. వరల్డ్ కప్‌ను కేవలం ఒక కెప్టెన్ మాత్రమే గెలిపించి ఉంటే.. ఇప్పుడు బట్లర్ ఎందుకు విజయాలు సాధించలేకపోతున్నాడు? అంటూ పరోక్షంగా ధోనిని విమర్శించాడు. విజయానికైనా, ఓటమికైనా ఒక్క ఆటగాడిని బాధ్యుడిని చేసి, అతనికే క్రెడిట్ ఇవ్వడం సరికాదని అన్నాడు. అయితే.. ప్రస్తుతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇంకా గంభీర్, ధోనిపై పడి ఏడ్వడం మానేయలేదా అంటూ క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు.
కాగా, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లను టీమిండియా ధోని కెప్టెన్సీలోనే గెలిచిన విషయం తెలిసిందే. అవే కాకుండా 2013లోనూ ధోని కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. ఇలా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా ధోనికి గుర్తింపు ఉంది. అయితే.. 2011 వరల్డ్ కప్ గెలిచిన క్రెడిట్‌ను ధోని ఒక్కడికే ఆపాదించడం, అతని వల్లే వరల్డ్ కప్ నెగ్గామని చెప్పడం సరికాదని గంభీర ఎప్పటి నుంచో వాదిస్తున్నాడు. జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా ఆడితేనే టీమిండియా ఛాంపియన్‌గా అవతరించిందని గంభీర్ వాదన. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ, అలాగే 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ గంభీరే టాప్ స్కోరర్. 2011లో శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో సచిన్, సెహ్వాగ్ తర్వారగా అవుటైన తర్వాత.. కోహ్లీతో కలిసి ఓ మంచి భాగస్వామ్యం, ఆ తర్వాత ధోనితో కలిసి గంభీర్ టీమిండియాను ఆదుకున్నాడు. 97 పరుగులు చేసి టీమిండియా విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. అయితే తన కంటే, మిగతా జట్టు సభ్యుల కంటే ధోనికే ఎక్కువ క్రెడిట్ దక్కిందనే కోపం గంభీర్‌లో ఉంది. ఆ కోపాన్ని మరోసారి బయటపెట్టాడు గంభీర్. మరి గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir hate for MS Dhoni success is constant #GautamGambhir #MSDhoni pic.twitter.com/hQrTmsbSU5
— Cric kid (@ritvik5_) October 28, 2023