విరాట్‌ కోహ్లీపై గౌతమ్‌ గంభీర్‌ మాస్‌ రివేంజ్‌! మొన్ననే కదా కలిసిపోయారు?

Gautam Gambhir, Virat Kohli: ఐపీఎల్‌ 2024లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. అయితే.. ఈ మ్యాచ్‌తో గంభీర్‌, కోహ్లీపై పగ తీర్చుకున్నట్లు అయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, Virat Kohli: ఐపీఎల్‌ 2024లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. అయితే.. ఈ మ్యాచ్‌తో గంభీర్‌, కోహ్లీపై పగ తీర్చుకున్నట్లు అయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ధూమ్‌ ధాంగా సాగుతోంది. బ్యాటర్ల విధ్వంసంతో ఫోర్లు, సిక్సుల వర్షం కురుస్తోంది. బుధవారం విశాఖపట్నం వేదికగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి క్రికెట్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఢిల్లీ బౌలర్లపై కాస్త కూడా కనికరం లేకుండా.. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. వారి పరుగులు దాహానికి ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో అతి పెద్ద స్కోర్‌ నమోదు అయింది. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సృష్టించిన 277 పరుగుల భారీ స్కోర్‌ను కేకేఆర్‌ బ్రేక్‌ చేసేలా కనిపించింది కానీ, 172 పరుగుల వద్ద ఆగిపోయింది. అయితే.. ఈ మ్యాచ్‌తో కేకేఆర్‌ మెంటర్‌గా ఉన్న గంభీర్‌.. విరాట్‌ కోహ్లీపై పగతీర్చుకున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం..

ఈ సీజన్‌ కంటే ముందు ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ‍స్కోర్‌ రికార్డు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేరిట ఉంది. ఐపీఎల్‌ 2013 సీజన్‌లో ఏప్రిల్‌ 23న అప్పట్లో ఉండే టీమ్‌ పూణె వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్సులతో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. గేల్‌ దెబ్బకు.. 20 ఓవర్లలో ఆర్సీబీ 263 పరుగుల కనీవిని ఎరుగుని స్కోర్‌ చేసింది. అప్పట్లో ఆ విధ్వంసం గురించి చాలా కాలం మాట్లాడుకున్నారు. ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి కంటే ముందు.. అదే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌. ఆ స్కోర్‌కు చాలా టీమ్స్‌ దగ్గర్లోకి వచ్చాయి కానీ, దాన్ని మాత్రం దాటలేకపోయాయి.

తాజాగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు ఆ రికార్డును తుడిచిపెట్టేశారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఎడెన్‌ మార్కరమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ చెలరేగడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఏకంగా 277 పరుగులు చేసి.. ఐపీఎల్‌ చరిత్రలోనే తిరిగరాసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆర్సీబీ రికార్డును బ్రేక్‌ చేసింది ఎస్‌ఆర్‌హెచ్‌. అయితే.. కొత్త రికార్డు నమోదు అయిన కొన్ని రోజులకే మరో సూపర్‌ బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఈ సారి కేకేఆర్‌ 272 పరుగులు చేసి.. ఆర్సీబీని సెకండ్‌ ప్లేస్‌ నుంచి థర్డ్‌ ప్లేస్‌కి తోసేంది. ఆర్సీబీ 263 పరుగులు చేసినప్పుడు కోహ్లీనే ఆ టీమ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ రికార్డును చెరిపేసి.. రెండో ప్లేస్‌లోకి కేకేఆర్‌ రావడంతో.. ఆ టీమ్‌కు మెంటర్‌గా ఉన్న గంభీర్‌.. కోహ్లీ రికార్డును బ్రేక్‌ చేయడంపై చాలా హ్యాపీగా ఉన్నాడని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments