Nidhan
Gautam Gambhir Speaks On Sarfaraz Khan Fate: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది టీమిండియా. చెన్నైలోని చెపాక్ వేదికగా గురువారం నుంచి జరగబోయే తొలి టెస్టులో ప్రత్యర్థితో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన.
Gautam Gambhir Speaks On Sarfaraz Khan Fate: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది టీమిండియా. చెన్నైలోని చెపాక్ వేదికగా గురువారం నుంచి జరగబోయే తొలి టెస్టులో ప్రత్యర్థితో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన.
Nidhan
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది టీమిండియా. చెన్నైలోని చెపాక్ వేదికగా గురువారం నుంచి మొదలయ్యే తొలి టెస్టులో ప్రత్యర్థితో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌లో గెలుపుతో రెండు టెస్టుల ఈ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని చూస్తోంది. పాకిస్థాన్ మీద గెలిచామని భారత్‌ను కూడా ఓడిస్తామంటూ ఓవరాక్షన్ చేస్తున్న బంగ్లాను తొలి మ్యాచ్‌లోనే చిత్తుగా ఓడిస్తే అదిరిపోతుందని అనుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ తమ బెస్ట్ ఎఫర్ట్ పెట్టి అపోజిషన్ టీమ్‌ను ఎక్కడా లేవకుండా చూడాలని అనుకుంటోంది. ఈ తరుణంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫస్ట్ టెస్ట్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆయన రియాక్ట్ అయ్యాడు. వాళ్లిద్దరికీ జట్టులో చోటు ఇవ్వడం లేదన్నాడు.
అటు సీనియర్లు, ఇటు జూనియర్లతో టీమిండియా స్క్వాడ్ బలంగా కనిపిస్తోంది. స్పిన్, పేస్, బ్యాటింగ్.. ఇలా ఏ విభాగం తీసుకున్నా బెస్ట్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. చాలా ఆప్షన్స్ రెడీగా ఉండటంతో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవర్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో కోచ్ గంభీర్ కొంత స్పష్టత ఇచ్చాడు. ముఖ్యంగా ఇద్దరు యంగ్ ప్లేయర్స్ భవితవ్యంపై తేల్చేశాడు. వాళ్లకు టీమ్‌లో నో ఛాన్స్ అన్నాడు. గౌతీ చెప్పింది యంగ్ బ్యాటర్స్ సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ గురించే. వీళ్లిద్దరికీ తుదిజట్టులో ప్లేస్ లేదన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోసం వీళ్లు మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదన్నాడు గౌతీ. అయితే అవకాశాలు రావని అనుకోవద్దంటూ ఫ్యూచర్‌పై భరోసా ఇచ్చాడు.
‘మా టీమ్‌లో ఎవర్నీ తొలగించడాలు ఉండవు. ప్లేయింగ్ ఎలెవన్‌కు అవసరమైన ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటాం. మ్యాచ్, కండీషన్స్, సిచ్యువేషన్‌ను బట్టి ఎవర్ని తుదిజట్టులోకి తీసుకోవాలనేది డిసైడ్ అవుతాం. జురెల్ అద్భుతమైన ఆటగాడు. కానీ రిషబ్ పంత్ టీమ్‌లోకి వస్తే అతడు బెంచ్‌పై కూర్చోక తప్పదు. కొన్నిసార్లు ఈ ఎదురుచూపులు తప్పవు. మరో యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. వీళ్లిద్దరికీ భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాం. కానీ ప్రస్తుతానికి టీమ్‌లో చోటు లేదు. వీళ్లు వెయిట్ చేయాల్సిందే’ అని గంభీర్ స్పష్టం చేశాడు. గౌతీ కామెంట్స్‌తో ప్లేయింగ్ ఎలెవన్‌లో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉండటం ఖాయమైంది. దీంతో దాదాపుగా తుదిజట్టుపై ఓ అంచనా వచ్చేసింది. మరి.. జురెల్, సర్ఫరాజ్ వెయిట్ చేయాల్సిందే అంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Gautam Gambhir has all but confirmed that KL Rahul will play in the first Test against Bangladesh ahead of Sarfaraz Khan.#INDvsBAN #KLRahul #SarfarazKhan #GautamGambhir #CricketTwitter pic.twitter.com/HqEaJMDTFV
— InsideSport (@InsideSportIND) September 18, 2024