టీ20 WCకు ఆ ప్లేయర్‌ను సెలెక్ట్‌ చేయకుంటే.. అతనికి కాదు, ఇండియాకే నష్టం!

Gautam Gambhir, Sanju Samson: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం టీమిండియా ఎంపికపై అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే గౌతమ్‌ గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, Sanju Samson: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం టీమిండియా ఎంపికపై అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే గౌతమ్‌ గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఒక వైపు ఐపీఎల్‌ జోరుగా సాగుతున్నా.. మరోవైపు టీ20 వరల్డ్‌ కప్‌ గురించి తీవ్ర స్థాయిలో క్రికెట్‌ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. నేడో రేపో టీ20 వరల్డ్‌ కప్‌ కోసం భారత సెలెక్టర్లు స్క్వౌడ్‌ను ప్రకటించే అవకాశం ఉండటంతో.. ఎవర్ని ఎంపిక చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్‌ గంభీర్‌ టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఎంపికపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్లేయర్‌ను వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోకుంటే.. అతనికి కాదు, టీమిండియాకే నష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ గంభీర్‌ ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల​్‌ కప్‌ టీమ్ కోసం చాలా స్థానాలు ఖాలీగా ఉన్నాయి. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి కొంతమంది ప్లేయర్లు తప్పా.. ఎవరి ప్లేస్‌ కూడా కన్ఫామ్‌ కాదు. అయితే… టీ20 వరల్డ్‌ కప్‌లో ఎలాగైన చోటు సాధించాలని చాలా మంది భారత క్రికెటర్లు ఐపీఎల్‌ 2024లో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఎంతో కీలకమైన ఈ ప్లేస్‌ కోసం రిషభ్‌ పంత్‌, సంజు శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, దినేష్‌ కార్తీక్‌ పోటీ పడుతున్నారు. వీరిలో రిషభ్‌ పంత్‌ ఫస్ట్‌ ఛాయిస్‌గా ఉండే అవకాశం ఉంది. అయితే.. సంజు శాంసన్‌ను ఎంపిక చేయకుంటే.. అతనికి కాదు టీమిండియాకే నష్టం అంటూ గంభీర హెచ్చరిస్తున్నాడు.

ప్రస్తుతం సంజు శాంసన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. వికెట్‌ కీపర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంజు.. బ్యాటర్‌గా అంతకు మించి రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సంజు 77 యావరేజ్‌, 161.09 స్ట్రైక్‌రేట్‌తో 385 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 82(నాటౌట్‌)గా ఉంది. అలాగే 36 ఫోర్లు, 17 సిక్సులతో సూపర్‌ డూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇంత మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిన ఎంపిక చేయకుండా పక్కనపెడితే.. టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా చాలా నష్టపోవాల్సి వస్తుందని క్రికెట్‌ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి టీ20 వరల్డ్‌ కప్‌కు శాంసన్‌ను ఎంపిక చేయకుంటే.. టీమిండియాకే నష్టం అని గంభీర పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments