Somesekhar
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. అందులో భాగంగా ఐపీఎల్ పై, బీసీసీఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. అందులో భాగంగా ఐపీఎల్ పై, బీసీసీఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Somesekhar
గౌతమ్ గంభీర్.. క్రికెట్ గురించి కాస్తో.. కూస్తో తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఇక ఈ మాజీ క్రికెటర్ గ్రౌండ్లో ఎంత దూకుడుగా ఉంటాడో మనందరికి తెలిసిందే. ఇక ఇదే దూకుడును బయటకూడా చూపిస్తూనే ఉన్నాడు ఈ మాజీ క్రికెటర్. ఎక్కువగా మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీలపై విమర్శలు గుప్పిస్తూ.. వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఓ వైపు మెంటర్ గానే కాకుండా లీగ్ క్రికెట్ లు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. అందులో భాగంగా ఐపీఎల్ పై, బీసీసీఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. టీమిండియా క్రికెట్ కోచ్ గా అవకాశం వస్తే ఎలా చేస్తారు? అని అడగ్గా.. దానికి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదన్నాడు. ఇక క్రికెట్ లోకి రాకపోయుంటే, ఏం చేసేవారు అన్న ప్రశ్నకు ఆర్మీలో చేరి ఉండేవాడినని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గంభీర్ కు ఎదురైంది. అదేంటంటే? ఐపీఎల్ స్టార్ట్ చేయకపోయి ఉంటే ఎలా ఉండేది? అన్న దానికి సమాధానంగా.. “ఒకవేళ ఐపీఎల్ ప్రారంభించకపోతే.. అది బీసీసీఐ తీసుకునే అత్యంత చెత్త నిర్ణయం అయ్యుండేది. భారత క్రికెట్ లో విప్లవాత్మక నిర్ణయం ఐపీఎల్ ప్రారంభించడమే” అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్. ఒకవేళ బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించకపోతే.. భారత క్రికెట్ పరిస్థితి మరోలా ఉండేది అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. మరి గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.