Gautam Gambhir: పాంటింగ్, మెక్ గ్రాత్ కు నో ప్లేస్.. గంభీర్ ఎదుర్కొన్న ఆల్ టైమ్ బెస్ట్ టీమ్ ఇదే!

Gautam Gambhir All-Time World XI Team: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కెరీర్ లో ఎదుర్కొన్న ప్రపంచంలోని ఆటగాళ్లందరిలో కెల్లా బెస్ట్ టీమ్ ను ప్రకటించాడు. ఈ జట్టులో ఆసీస్ దిగ్గజాలు అయిన పాంటింగ్, మెక్ గ్రాత్ కు చోటు దక్కలేదు. మరి గంభీర్ బెస్ట్ టీమ్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

Gautam Gambhir All-Time World XI Team: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కెరీర్ లో ఎదుర్కొన్న ప్రపంచంలోని ఆటగాళ్లందరిలో కెల్లా బెస్ట్ టీమ్ ను ప్రకటించాడు. ఈ జట్టులో ఆసీస్ దిగ్గజాలు అయిన పాంటింగ్, మెక్ గ్రాత్ కు చోటు దక్కలేదు. మరి గంభీర్ బెస్ట్ టీమ్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. వారిలో వీరే తమ ఫేవరెట్ ప్లేయర్లు అని కొందరు చెబితే.. నేను ఎదుర్కొన్న ఆటగాళ్లలో అత్యంత టఫెస్ట్ ఆటగాళ్లు వీరు అని మరికొందరు చెబుతుంటారు. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కెరీర్ లో ఎదుర్కొన్న ప్లేయర్లు అందరిని కలిపి ఆల్ టైమ్ బెస్ట్ టీమ్ గా ప్రకటించాడు. అనూహ్యంగా ఇందులో ఆసీస్ దిగ్గజాలు అయిన పాంటింగ్, మెక్ గ్రాత్ లకు చోటు కల్పించలేదు గంభీర్. మరి గంభీర్ ఎదుర్కొన్న ఆల్ టైమ్ బెస్ట్ టీమ్ లో ఎవరెవరు చోటు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం.

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న ఆటగాళ్లందరిలో బెస్ట్ ప్లేయర్లను ఎంపిక చేసి, ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్ల లిస్ట్ ను ప్రకటించాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ.. ఈ టీమ్ ను ప్రకటించాడు. ఇందులో పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లను తీసుకోవడం గమనార్హం. ఇక ఈ టీమ్ కి ఓపెనర్లుగా ఆడమ్ గిల్ క్రిస్ట్, మాథ్యూ హెడెన్ లను తీసుకున్నాడు. వన్ డౌన్ బ్యాటర్ గా సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ ను, నాలుగో ప్లేస్ కు విండీస్ దిగ్గజం బ్రియన్ లారా, ఐదో స్థానానికి పాక్ లెజెండ్ ఇంజమామ్ ఉల్ హక్ ను ఎంపిక చేశాడు.

ఇక ఆల్ రౌండర్ల కోటాలో పాకిస్తాన్ కు చెందిన అబ్దుల్ రజాక్, ఇంగ్లండ్ నుంచి ఆండ్రూ ఫ్లింటాప్, ఆసీస్ నుంచి ఆండ్రూ సైమండ్స్ ఉన్నారు. బౌలర్లలో పాక్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్ తో పాటుగా జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ను జట్టులోకి తీసుకున్నాడు. కాగా.. తాను ప్రకటించిన బెస్ట్ టీమ్ లోకి న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ప్లేయర్లను తీసుకోకపోవడం గమనార్హం. అలాగే ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్, గ్లెన్ మెక్ గ్రాత్ లకు చోటు కల్పించకపోవడం చాలా మందిని షాక్ కు గురిచేసింది.

గంభీర్ ఎదుర్కొన్న ఆల్ టైమ్ బెస్ట్ టీమ్:

ఆడమ్ గిల్ క్రిస్ట్, మాథ్యూ హెడెన్, ఏబీ డివిలియర్స్, ఇంజమాన్ ఉల్ హక్, బ్రియన్ లారా, ఆండ్రూ సైమండ్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్, అబ్దుల్ రజాక్, షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్, ముత్తయ్య మురళీధరన్.

Show comments