iDreamPost
android-app
ios-app

Harbhajan Singh: తనతో పోటీకి రావాలని అక్తర్‌కు సవాల్‌ విసిరిన హర్భజన్‌ సింగ్‌!

  • Published Jan 20, 2024 | 3:27 PM Updated Updated Jan 20, 2024 | 3:27 PM

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కు దమ్ముంటే నాతో పోటీకి రా అంటూ సవాల్ విసిరాడు హర్భజన్ సింగ్.  ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కు దమ్ముంటే నాతో పోటీకి రా అంటూ సవాల్ విసిరాడు హర్భజన్ సింగ్.  ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Harbhajan Singh: తనతో పోటీకి రావాలని అక్తర్‌కు సవాల్‌ విసిరిన హర్భజన్‌ సింగ్‌!

హర్భజన్ సింగ్.. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించి, టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. ఇక అతడు గ్రౌండ్ లో ఉన్నాడంటే ఎంటర్ టైన్ మెంట్ కు కొదవుండదు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా ప్రత్యర్థులను కవ్వించడంలో ముందుంటాడు భజ్జీ. తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత అప్పుడప్పుడు కామెంటేటర్ గా, టీ20 లీగుల్లో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా జరిగిన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ 2024 కప్ లో ఆడాడు భజ్జీ. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కు దమ్ముంటే నాతో పోటీకి రా అంటూ సవాల్ విసిరాడు హర్భజన్ సింగ్.  ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
షోయబ్ అక్తర్.. బుల్లెట్ లాంటి బంతులు సంధించి ప్రపంచ దిగ్గజ క్రికెటర్లకే ముచ్చెమటలు పట్టించాడు. ఇక తన రిటైర్మెంట్ తర్వాత పలు క్రికెట్ లీగుల్లో పాల్గొంటున్నాడు. అయితే తరచుగా టీమిండియా క్రికెటర్లపై కామెంట్స్ చేస్తూ, నోరుపారేసుకుంటుంటాడు అక్తర్. అతడి మాటలకు అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తుంటారు భారత ఆటగాళ్లు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తనతో పోటీకి రావాలని షోయబ్ అక్తర్ కు సవాల్ విసిరాడు. ఇంతకీ ఏ విషయంలో పోటీ పడాలి అన్నాడంటే? ఓ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో వీరిద్దరు గ్రౌండ్ లో కనిపించారు.
ఇక అప్పడు అక్తర్ బాల్ పట్టుకుని తన బౌలింగ్ యాక్షన్ చేసి చూపించాడు. అప్పుడే కెమెరాలోకి ఎంటర్ అయిన భజ్జీ..”నాతో రేస్ లో పోటీ పడతావా? నాకు తెలుసు ఈ రన్నింగ్ రేసులో నేను నిన్ను ఓడిస్తాను” అంటూ అక్తర్ పేరును టాగ్ చేశాడు. దీనికి అక్తర్ రిప్లై ఇస్తూ..”చూడండి ఈ స్పిన్నర్ నన్ను ఓడిస్తాడంట. ఏం జమనా నడుస్తుంద భాయ్” అంటూ భజ్జీ పేరును రాసుకొచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. భజ్జీ నువ్వింకా మారలేదు.. అక్తర్ ని భలే ఆటపట్టించావ్ అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి సరదాగా అక్తర్ కు హర్భజన్ సవాల్ విసరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobet girişjojobet