T20 World Cup: చరిత్ర సృష్టించిన ఉగాండ బౌలర్‌! క్రికెట్‌ హిస్టరీలో తొలిసారి..

Frank Nsubuga, T20 World Cup 2024, Uganda vs PNG: టీ20 వరల్డ్‌ కప్‌లో కొత్త చరిత్ర నమోదైంది. ఉగాండ బౌలర్‌ నాలుగు ఓవర్లలో కేవలం నాలుగు రన్స్‌ ఇచ్చి అద్భుతం చేశాడు. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే ఇలా తొలిసారి జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Frank Nsubuga, T20 World Cup 2024, Uganda vs PNG: టీ20 వరల్డ్‌ కప్‌లో కొత్త చరిత్ర నమోదైంది. ఉగాండ బౌలర్‌ నాలుగు ఓవర్లలో కేవలం నాలుగు రన్స్‌ ఇచ్చి అద్భుతం చేశాడు. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే ఇలా తొలిసారి జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. చిన్న టీమ్స్‌ పెద్ద టీమ్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. తాజాగా ఉంగాడ జట్టు బౌలర్‌ ఏకంగా ప్రపంచ రికార్డను నెలకొల్పాడు. ఛాంపియన్‌ టీమ్స్‌లోని హేమాహమీ బౌలర్లకే సాధ్యం కానీ రికార్డును సాధించి.. ఉంగాడ పేరు ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోయేలా చేశాడు. ఆ బౌలర్‌ పేరు ఫ్రాంక్‌ న్సుబుగా. పేరు విచిత్రంగా ఉన్నా.. అతను సాధించిన రికార్డు మాత్రం అద్భుతంగా ఉంది. టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా గయానా స్టేడియంలో పీఎన్‌జీ(పాపువా న్యూ గినియా), ఉగాండ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు నమోదు అయింది.

ఉగాండ బౌలర్‌ ఫ్రాంక్‌ న్సుబుగా 4 ఓవర్లు వేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇంత వరకు ఇంత తక్కువ ఎకానమీతో బౌలింగ్‌ చేసిన బౌలర్‌ లేడు. న్సుబుగా ఎకానమీ కేవలం 1. ఇదే ఇప్పుడు టీ20 క్రికెట్‌ హిస్టరీలో అత్యంత పొదుపైన బౌలింగ్‌. ఒక మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల పూర్తి కోటా వేసి.. కేవలం 1.0 ఎకానమీ కలిగి బౌలర్‌గా ఫ్రాంక్‌ న్సుబుగా చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్‌ 9, 11, 13, 15 ఓవర్లు వేసిన న్సుబుగా.. తొలి ఓవర్‌లో 2 సింగిల్స్‌, తన నాలుగో ఓవర్‌లో రెండు సింగిల్స్‌ మాత్రమే ఇ‍చ్చాడు. మధ్యలో రెండు ఓవర్లు మెయిడెన్లుగా వేశాడు. పైగా ఆ రెండు ఓవర్స్‌లో ఒక్కో వికెట్‌ సాధించాడు. మొత్తంగా 4 ఓవర్లలో 4 రన్స్‌ ఇచ్చి 2 వికెట్లు తీసి.. చరిత్ర సృష్టించాడు.

ఫ్రాంక్‌ న్సుబుగా కంటే ముందు అత్యుత్తమ ఎకానమీ సౌతాఫ్రికా స్టార్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే పేరిట ఉండేది. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లోనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నోర్జే 4 ఓవర్లలో కేవలం 7 రన్స్‌ ఇచ్చి 1.8 ఎకానమీ నమోదు చేశాడు. ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్‌ అజంతా మెండిస్‌, బంగ్లాదేశ్‌ బౌలర్‌ మొహమ్మదుల్లా, శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగా 4 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 2 ఎకానమీతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. అత్యుత్తమ ఎకానమీతో పాటు టీ20 క్రికెట్‌లో అత్యధిక మెయిడెన్‌ ఓవర్లు వేసిన బౌలర్‌గాను న్సుబుగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. మొత్తం ఇప్పటి వరకు 17 మెయిడెన్‌ ఓవర్లు వేశాడు. టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యధికం. అతని తర్వాత కెన్యా బౌలర్‌ షీమ్‌ 12, టీమిండియా బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 11, భువనేశ్వర్‌ కుమార్‌ 10 మెయిడెన్‌ ఓవర్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. మరి ఉగాండ బౌలర్‌ ఫ్రాంక్‌ న్సుబుగా నాలుగు ఓవర్లలో నాలుగు రన్స్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments