వీడియో: మ్యాచ్‌ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి వచ్చిన నక్క! ఏం జరిగిదంటే..?

Fox, Hampshire, Surrey, Vitality Blast: గ్రౌండ్‌లోకి జంతువులు రావడం కామన్‌ అయిపోయింది.. కానీ, తాజాగా ఓ నక్క గ్రౌండ్‌లోకి దూసుకొని రావడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. నక్క సృష్టించిన హంగామా గురించి ఇప్పుడు చూద్దాం..

Fox, Hampshire, Surrey, Vitality Blast: గ్రౌండ్‌లోకి జంతువులు రావడం కామన్‌ అయిపోయింది.. కానీ, తాజాగా ఓ నక్క గ్రౌండ్‌లోకి దూసుకొని రావడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. నక్క సృష్టించిన హంగామా గురించి ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌లు కాస్త అంతరాయం కలుగుతుంది. ఎక్కువ సందర్భాల్లో కుక్కలు గ్రౌండ్‌లోకి వస్తే మ్యాచ్‌ కొద్ది సేపు నిలిచిపోతుంది. కొన్నిసార్లు పాములు, పక్షులకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, తొలిసారి ఓ నక్క గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి, మ్యాచ్‌ను కొద్ది సేపు నిలిపేసింది. నక్క గ్రౌండ్‌లోకి వచ్చిన ఘటన వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ఈ టీ20 లీగ్‌లో.. గురువారం ది ఓవెల్‌ మైదనాంలో సర్రె, హాంపైషైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.

హాంపైషైర్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సందర్భంగా ఒక్కసారిగా నక్క గ్రౌండ్‌లోకి దూసుకొని రావడంతో ఆటగాళ్లు కంగారు పడ్డారు. దీంతో మ్యాచ్‌కు కొద్ది సేపు అంతరాయం కలిగింది. గ్రౌండ్‌లోకి వచ్చిన నక్క.. ప్రేక్షకుల అరుపులతో కంగారుపడి.. గ్రౌండ్‌లో అటూ ఇటూ వేగంగా పరిగెత్తింది. మొత్తానికి గ్రౌండ్‌ సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా.. వారికి ఆ నక్క చిక్కలేదు. చివరి గ్రౌండ్‌ మొత్తం ఒక రౌండ్‌ వేసిన నక్క బౌండరీ లైన్‌ దాటేసి.. గ్రౌండ్‌ బయటికి వెళ్లిపోయింది. నక్క సృష్టించిన హంగామాతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హాంపైషైర్‌ నిర్ణీత 19.5 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. టోబీ ఆల్‌బర్ట్‌ 45 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు చేశాడు. కెప్టెన్‌ జెమ్స్‌ 11 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగులతో రాణించాడు. సర్రే బౌలర్లలో జోర్డాన్‌ క్లార్క్‌ 3 వికెట్లతో చెలరేగాడు. ఇక 184 పరుగుల టార్గెట్‌లో బరిలోకి దిగిన సర్రే జట్టు 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి విజయం సాధించింది. సామ్‌ కరన్‌ 58 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 102 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. మొత్తంగా నక్క వల్ల క్యాచ్‌కు అంతరాయం కలిగినా.. తర్వాత పరుగులు వరద పారింది. మరి ఈ మ్యాచ్‌ మధ్యలో నక్క గ్రౌండ్‌లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments