iDreamPost
android-app
ios-app

IPLలో ఫిక్సింగ్‌ కలకలం! వివాదంలోకి రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌!

  • Published Apr 18, 2024 | 4:54 PM Updated Updated Apr 18, 2024 | 4:54 PM

IPL Bookies, Wankhede: ప్రశాంతంగా సాగుతున్న ఐపీఎల్‌లో ఒక్కసారిగా ఫిక్సింగ్‌ భూతం తన ప్రతాపం చూపేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. దాని గురంచి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IPL Bookies, Wankhede: ప్రశాంతంగా సాగుతున్న ఐపీఎల్‌లో ఒక్కసారిగా ఫిక్సింగ్‌ భూతం తన ప్రతాపం చూపేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. దాని గురంచి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 18, 2024 | 4:54 PMUpdated Apr 18, 2024 | 4:54 PM
IPLలో ఫిక్సింగ్‌ కలకలం! వివాదంలోకి రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌!

క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని అందిస్తున్న ఐపీఎల్‌ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడో ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ జరిగిందని కొంతమంది ఆటగాళ్లను అలాగే, కొన్ని టీమ్స్‌ను బ్యాన్‌ చేసిన ఘటన చాలా మంది క్రికెట్‌ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. 2016, 2017 సీజన్స్‌లో పాల్గొనకుండా.. రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణంగానే ఆ రెండు జట్లపై నిషేధం విధించారు. ఇప్పుడు తాజాగా మరోసారి.. ఐపీఎల్‌పై ఫిక్సింగ్‌ భూతం తన కోరలు చాస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఐపీఎల్‌లో మరోసారి ఫిక్సింగ్‌ కలకలం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజాగా ఓ నలుగురు అనుమానిత బుకీలను గుర్తించిన ఐపీఎల్‌ కమిటీ వారిని స్టేడియంలో ఉండే లగ్జరీ బాక్స్‌ల నుంచి బహిష్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ​ముంబై ఇండియన్స్‌ హోం గ్రౌండ్‌ అయినా వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో అలాగే రాజస్థాన్‌ హోం గ్రౌండ్‌ అయిన జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలోని లగ్జరీ బాక్స్‌ల్లో ఓ నలుగురు వ్యక్తులను బుకీలుగా అనుమానిస్తూ.. వారిని ఆ ప్రాంతంలోకి రాకుండా నిషేధం విధించినట్లు సమాచారం. పెద్ద మనుషుల్లా చెలామణి అవుతూ.. ఆటగాళ్లతో బెరసారాలు జరిపేందుకు కొంతమంది కేటుగాళ్లు.. లగ్జరీ బాక్స్‌ల్లో మ్యాచ్‌ చూసేందుకని తిష్టవేసి.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతుంటారు.

గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణంగా క్రికెట్‌పై, అలాగే దేశ ప్రతిష్ట దెబ్బతిందని భావించిన బీసీసీఐ ఇలాంటి వ్యవహారాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా.. ప్రతి క్షణం, ప్రతి చోటు అలెర్ట్‌గా ఉంటుంది. ఈ జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఓ నలుగురు వ్యక్తులను బుకీలుగా అనుమానిస్తూ.. వారిని వాంఖడే, మాన్‌సింగ్‌ క్రికెట్‌ స్టేడియాలకు రాకుండా బ్యాన్‌ చేశారు. అయితే.. ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. మరి క్రికెట్‌ అభిమానులకు వినోదాన్ని పంచుతూ.. ప్రశాంత సాగుతున్న ఐపీఎల్‌పై ఈ ఫిక్సింగ్‌ భూతం మళ్లీ కోరలు చాస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.