iDreamPost
android-app
ios-app

650 మందితో సె*క్స్ చేశా, వారానికి ఆరుగురు అమ్మాయిలు: విండీస్ మాజీ క్రికెటర్

  • Author Soma Sekhar Published - 01:59 PM, Fri - 21 July 23
  • Author Soma Sekhar Published - 01:59 PM, Fri - 21 July 23
650 మందితో సె*క్స్ చేశా, వారానికి ఆరుగురు అమ్మాయిలు: విండీస్ మాజీ క్రికెటర్

జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఈ ప్రపంచంలో వెస్టిండీస్ క్రికెటర్లకు తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. పబ్ లు,పార్టీలు, డ్యాన్స్ లు, అమ్మాయిలు ఇలా అన్నింట్లో ఆరితేరి ఉంటారు విండీస్ వీరులు. ఆట విషయం పక్కన పెడితే.. శృంగార కార్యకలాపాల్లో ఈ విండీస్ క్రికెటర్లు వాళ్లకు వాళ్లే సాటి. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అమ్మాయిలతో పార్టీలు, పబ్బుల్లో దిగిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయాలన్నీ కొద్దిసేపు పక్కన పెడితే.. ఓ విండీస్ మాజీ క్రికెటర్ తన ఆటో బయోగ్రఫీలో సంచలన విషయాలను వెల్లడించాడు. తాను ఇప్పటి వరకు 650 మందితో సె*క్స్ చేశానని, వారానికి ఆరుగురు అమ్మాయిలతో డేటింగ్ కు వెళ్లేవాడినని తన జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. మరి సంచలన విషయాలు వెల్లడించిన ఆ విండీస్ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెటర్లు పర్యటనల నిమిత్తం ప్రపంచంలోని వివిధ దేశాలు పర్యటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు వివిధ దేశాలకు చెందిన అమ్మాయిలతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక కొంత మంది ఈ పరిచయాలను శృంగారం వరకు తీసుకెళ్లి హోటల్లలో ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా నేను కూడా అలా ఎంజాయ్ చేశానని తన జీవిత చరిత్రలో చెప్పుకొచ్చాడు వెస్టిండీస్ మాజీ పేసర్ టినో బెస్ట్. తన జీవిత చరిత్ర ‘మైండ్ ద విండోస్: మై స్టోరీ’ పేరుతో అతడు తన ఆటోబయోగ్రఫీని రాశాడు. ఈ పుస్తకంలో ఇప్పటి వరకు తాను 650 మంది యువతులతో సెక్స్ లో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు.

ఇక కరేబియన్ దీవుల్లో తనకంటే అందగాడు లేడని ఈ బుక్ లో రాసుకొచ్చాడు. అందుకే తనను ‘బ్లాక్ బ్రాడ్ ఫిట్’ గా పిలుచుకుంటానని తెలిపాడు. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన గుండోడిని నేను, నాకు అమ్మాయిలంటే పిచ్చని.. వారికి కూడా నేనంటే పిచ్చని రాసుకొచ్చాడు. ఇక తనకు సెక్స్ అంటే పిచ్చి అని, అతడు చూసిన అమ్మాయిల్లో ఎవరితో సెక్స్ చేయాలో సెలక్ట్ చేసుకుంటానని పేర్కొన్నాడు. వారంలో 5 లేదా 6 గురు కొత్త అమ్మాయిలతో డేటింగ్ కు వెళ్తుంటానని, ఒక్కసారి డేటింగ్ కు వెళ్లిన అమ్మాయితో మరోసారి డేట్ కు వెళ్లడం నచ్చదని టినో బెస్ట్ తన జీవిత చరిత్రలో రాసుకొచ్చాడు.

ఇక అతడికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా దేశాల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్లు, కేవలం 2005 ఆస్ట్రేలియా పర్యటనలో తాను 40 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నానని, అప్పడు తన వయసు 24 సంవత్సరాలే అని బుక్ లో చెప్పుకొచ్చాడు. మరి ఈ విండీస్ క్రికెటర్ వెల్లడించిన సంచలన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş