Krishna Kowshik
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించిన పేసర్ షోయబ్ అక్తర్.. మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించిన పేసర్ షోయబ్ అక్తర్.. మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
Krishna Kowshik
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ మరోసారి తండ్రి అయ్యాడు. 48 ఏళ్ల వయస్సులో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అక్తర్ సతీమణి రుబాబ్ ఖాన్ శుక్రవారం రాత్రి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అక్తర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. కాగా, అక్తర్ దంపతులకు ఇది మూడో సంతానం. ఇప్పటికే వీరికి మహమ్మద్ మికైల్ అలీ, మహమ్మద్ ముజద్దీద్ అలీ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈ దంపతులకు ఆడ పిల్ల జన్మించింది అని తెలియగానే.. పలువురు క్రికెటర్లు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘ మహమ్మద్ మికైల్ అలీ, మహమ్మద్ ముజద్దీద్ అలీలకు తోడుగా ఇప్పుడు ఓ చిన్నారి చెల్లెలు వచ్చింది. ఆ అల్లా మాకు పండంటి బిడ్డను అందించారు. 1445 ఏహెచ్ షాబన్ 19న (ఉర్దూ క్యాలెండర్) ప్రకారం జుమ్మా ప్రార్థనల సమయంలో మా చిన్నారి నూరే అలీ అక్తర్‌కు స్వాగతం. 2024 మార్చి 1న జన్మించిన నా కూతురిని మీరందరూ ఆశీర్వదించండి’ అంటూ షోయబ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. 2014లో షోయబ్ అక్తర్, రుబాబ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అతడి వయస్సు 38 సంవత్సరాలు. అప్పట్లో రుబాబ్ వయస్సు 20 సంవత్సరాలు. అప్పట్లో తన కన్నా 18 సంవత్సరాలు చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో విమర్శల పాలు అయ్యాడు.
ఈ దంపతులకు తొలి సంతానం 2016లో కలిగింది. ఆ ఏడాది మహ్మద్ మికైల్ అలీ పుట్టగా, 2019లో చిన్న కుమారుడు ముజద్దీద్ అలీ జన్మించాడు. ఇప్పుడు పాప పుట్టింది. షోయబ్ అక్తర్ 90వ దశకంలో పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లకు చెమటలు పట్టించేవాడు. ఇక తన కెరీర్ విషయానికి వస్తే.. 46 టెస్టుల్లో 178 వికెట్లు , 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు. 15 టీ 20 మ్యాచులు ఆడి..19 వికెట్లు తీశాడు. ఐపీఎల్ విషయానికి వస్తే.. 2008లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 3 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి.. 5 వికెట్లు పడగొట్టాడు. 2011లో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత పలు ఛానెల్స్ వ్యాఖ్యాతగా మెరిశాడు.