సెహ్వాగ్‌ది అసలు ఆటే కాదు.. పాక్‌లో పుట్టి ఉంటేనా: పాక్‌ క్రికెటర్‌

  • Author Soma Sekhar Published - 04:20 PM, Mon - 17 July 23
  • Author Soma Sekhar Published - 04:20 PM, Mon - 17 July 23
సెహ్వాగ్‌ది అసలు ఆటే కాదు.. పాక్‌లో పుట్టి ఉంటేనా: పాక్‌ క్రికెటర్‌

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. కానీ బౌలర్లను వణికించే ఆటగాళ్లు మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన జాతికి చెందిన వాడే టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. వీరేంద్రుడి బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బౌలర్ ఎవరన్నది అతడికి లెక్కలేదు.. తొలి బాల్ నుంచే వీర బాదుడు మెుదలు పెడతాడు. అందుకే వీరూ భాయ్ క్రీజ్ లో ఉన్నాడంటే చాలు ప్రత్యర్థి బౌలర్ కు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. సెహ్వాగ్ బాధితుడు కానీ బౌలర్ ప్రపంచంలో లేడంటే అతిశయోక్తికాదు. అలాంటి సెహ్వాగ్ కు అసలు ఆటరాదని, అతడు పాక్ లో పుట్టి ఉంటే.. క్రికెట్ లోకి అడుగుపెట్టే వాడు కాడని సంచలన వ్యాఖ్యాలు చేశాడు పాకిస్థాన్ మాజీ పేసర్.

వీరేంద్ర సెహ్వాగ్ కు అసలు ఆటే రాదని, అతను పాక్ లో పుట్టి ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి ఉండే వాడు కాదని పాకిస్థాన్ మాజీ పేసర్ రానా నవీద్ ఉల్ హసన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2005 నాటి వన్డే సిరీస్ సంగతులను తాజాగా గుర్తు చేస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు రానా నవీద్. అప్పటి మ్యాచ్ గురించి రానా నవీద్ ఉల్ హసన్ మాట్లాడుతూ..”ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో సెహ్వాగ్ అద్భుతంగా ఆడాడు. ఒక మ్యాచ్ లో సెంచరీ చేయగా.. రెండో మ్యాచ్ లో 70కి పైగా స్కోర్ చేశాడు. దాంతో నేను కెప్టెన్ ఇంజమామ్ దగ్గరికి వెళ్లి బంతి నాకివ్వమని అడిగా. సెహ్వాగ్ ను నెక్ట్స్ బంతికి అవుట్ చేస్తానని ఇంజమామ్ తో చెప్పా. దానికి అతడు ఆశ్చర్యపోయాడు. నిజానికి అంతకు ముందే అతడిని నేను స్లెడ్జింగ్ చేశా. దాంతో నాపై అతడు కోపం పెంచుకున్నాడు. అయితే నా వ్యూహాన్ని అమలు చేస్తూ.. స్టో బాల్ వేశా.. అప్పటికే నాపై కోపంగా ఉన్న వీరూ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు” అంటూ ఆనాటి మ్యాచ్ సంగతి చెప్పుకొచ్చాడు రానా నవీద్.

ఈ క్రమంలోనే సెహ్వాగ్ ను అవుట్ చేయడం నాకు చాలా ఈజీ అని.. కానీ రాహుల్ ద్రవిడ్ ను ఔట్ చేయడం అత్యంత కష్టమైన పని అని నవీద్ గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సెహ్వాగ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సెహ్వాగ్ కు అసలు బ్యాటింగ్ చేయడమే రాదని, అతడు పాక్ లో పుట్టిఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టేవాడికి కాదని సెహ్వాగ్ తోనే ఆ మ్యాచ్ లో చెప్పినట్లుగా నవీద్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు అన్ని నాదిర్ అలీ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడాడు. కాగా.. 2005లో జరిగిన ఆరు మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లు టీమిండియా గెలుపొందగా.. మిగిలిన నాలుగు మ్యాచ్ లు పాక్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ లో నాలుగు సార్లు సెహ్వాగ్ ను నవీద్ ఉల్ హసన్ అవుట్ చేయడం గమనార్హం. ఇక నవీద్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు.. సెహ్వాగ్ అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలుసు నీకు అంతసీన్ లేదంటూ నవీద్ ను విమర్శిస్తూ.. కామెంట్స్ పెడుతున్నారు. మరి వీరేంద్ర సెహ్వాగ్ పై రానా నవీద్ చేసిన చౌకబారు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా ఇండియన్ క్రికెటర్! ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా!

Show comments