IND vs SA: టీ20 క్రికెట్‌లో ఒక ఫైనల్‌ ఇలా జరగడం ఇదే తొలిసారి! ఏంటి స్పెషల్‌?

IND vs SA, T20 World Cup 2024, Final: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ ఒక కొత్త చరిత్రకు వేదిక కానుంది. టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇలాంటి ఒక మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ ఫైనల్‌ మ్యాచ్‌ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

IND vs SA, T20 World Cup 2024, Final: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ ఒక కొత్త చరిత్రకు వేదిక కానుంది. టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇలాంటి ఒక మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ ఫైనల్‌ మ్యాచ్‌ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీ20 క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి ఓ స్పెషల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. 2007 నుంచి మొదలైన టీ20 వరల్డ్‌ కప్‌ చరిత్రలో.. 17 ఏళ్ల తర్వాత జరిగే ఒక ప్రత్యేకమైన ఫైనల్‌ ఇదే. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య శనివారం జరిగిన ఫైనల్‌ చాలా స్పెషల్‌. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఎలాగైనా సరే కప్పు కొట్టడమే లక్ష్యంగా ఇటు ఇండియా, అటు సౌతాఫ్రికా తుది పోరుకు రెడీ అయ్యాయి.

తమ మొట్టమొదటి వరల్డ్‌ కప్‌ గెలవాలని సౌతాఫ్రికా, పొట్టి ప్రపంచ కప్‌ను రెండో సారి ముద్దాడాలని టీమిండియా జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే.. ఈ రెండు జట్లు కూడా అసలు ఓటమి అనేదే లేకుండా ఫైనల్‌కు చేరాయి. సౌతాఫ్రికా వరుసగా 8 మ్యాచ్‌లు(గ్రూప్‌ స్టేజ్‌లో 4 మ్యాచ్‌లు, సూపర్‌ 8లో 3 మ్యాచ్‌లు, ఒక సెమీ ఫైనల్‌ మ్యాచ్‌) గెలిచి ఫైనల్‌ దూసుకొచ్చింది. అలాగే టీమిండియా కూడా ఓటమి ఎరుగని జట్టుగానే ఫైనల్‌కు చేరకుంది. అయితే సౌతాఫ్రికా కంటే ఒక​ మ్యాచ్‌ తక్కువగా 7 మ్యాచ్‌లు వరుసగా గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. గ్రూప్‌ స్టేజ్‌లో 3 మ్యాచ్‌లు, సూపర్‌ 8లో 3 మ్యాచ్‌లు, ఒక సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ మొత్తం 7 మ్యాచ్‌లు గెలిచింది.

గ్రూప్‌ స్టేజ్లో కెనడాతో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇండియాకు ఒక విన్‌ మిస్‌ అయిందనే చెప్పుకోవాలి. లేదంటే సౌతాఫ్రికాతో సమానంగా 8 వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. ఇప్పటి వరకు జరిగిన ఏ టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా ఫైనల్‌ చేరిన రెండు టీమ్స్‌ ఓటమి లేకుండా లేవు. లీగ్‌ స్టేజ్‌లోనో, సూపర్‌ 8 స్టేజ్‌లోనో ఒక మ్యాచ్‌ ఓడిపోయిన టీమ్స్‌ ఉన్నాయి. కానీ, టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలి.. ఫైనల్‌ చేరి రెండు జట్లు ఓటమి ఎరుగకుండా వచ్చాయి. ఇండియా, సౌతాఫ్రికా ఆ ఘనత సాధించి.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ ఆడనున్నాయి. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments