SNP
MS Dhoni, Rohit Sharma, CSK vs MI, IPL 2024: ఐదేసి సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఓ కొత్త చరిత్ర లిఖించబోతోంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
MS Dhoni, Rohit Sharma, CSK vs MI, IPL 2024: ఐదేసి సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఓ కొత్త చరిత్ర లిఖించబోతోంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఓ స్పెషల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆ సరికొత్త చరిత్రకు ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ వేదికగా కానుంది. ఈ మ్యాచ్ ఆదివారం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు ప్రారంభం కానుంది. అయితే.. ఏంటి ఈ మ్యాచ్‌కు ఇంత ప్రాముఖ్యత అనుకుంటున్నారా? ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోని, ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ కేవలం ఆటగాళ్లుగా మాత్రమే బరిలోకి దిగుతున్నారు. ఎందుకంటే.. రెండు టీమ్స్‌కు కూడా కొత్త కెప్టెన్స్ వచ్చారు.
రోహిత్ స్థానంలో హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ నియమిస్తే.. తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు ధోని. అయితే.. ధోని, రోహిత్ ఇద్దరిలో ఒక్కరు కూడా కెప్టెన్‌గా లేకుండా జరుగుతున్న తొలి సీఎస్‌కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఇదే. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు చెన్నై, ముంబై మధ్య మ్యాచ్ జరిగినా.. ధోని, రోహిత్ శర్మ ఇద్దరిలో కనీసం ఒక్కరైనా కెప్టెన్‌గా ఉండే వారు. చాలా సార్లు ఈ ఇద్దరే కెప్టెన్లుగా వారి టీమ్స్‌కు కెప్టెన్స్‌గా వ్యవహరించారు. హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఈ ఇద్దరు కూడా కెప్టెన్లు కాకుండా జరుగుతున్న తొలి చెన్నై, ముంబై మ్యాచ్‌గా ఈ ఆదివారం జరిగే మ్యాచ్ చరిత్రలో నిలిచిపోనుంది.
కాగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 3 విజయాలు సాధించి, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై.. పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. మరో వైపు ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై.. చెత్త స్టార్ట్‌ను అందుకుంది. తర్వాత పుంజుకుని రెండు వరుస విజయాలు సాధించి, మూడు ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. అయితే.. ఈ రెండు జట్లు ఏకంగా ఐదేసి సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఛాంపియన్స్ ఫైట్‌లో ఏ టీమ్ పైచేయి సాధిస్తోందోనని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో కొత్త హిస్టరీ నమోదు కాబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
FIRST TIME IN IPL HISTORY:
MI & CSK playing an IPL match without either MS Dhoni or Rohit Sharma as captains of their respective sides. pic.twitter.com/UvOYnN9uLK
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024