IND vs AFG: రోహిత్ నీ అనుభవం ఇదేనా.. ఆ మాత్రం తెలీదా?

  • Author Soma Sekhar Published - 07:16 PM, Wed - 11 October 23
  • Author Soma Sekhar Published - 07:16 PM, Wed - 11 October 23
IND vs AFG: రోహిత్ నీ అనుభవం ఇదేనా.. ఆ మాత్రం తెలీదా?

వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో ఏ చిన్న తప్పు చేసినా.. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ పాత్ర ఎంతో కీలకమైనది. గ్రౌండ్ లో ఫీల్డ్ సెటప్, బౌలింగ్ ఎవరికి ఇవ్వాలి, ఏ బ్యాటర్ ని ఎలా అవుట్ చేయాలి అన్నది జట్టు సారథి వేసే ప్లానింగ్ లో భాగంగానే ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు కెప్టెన్లు పొరపాటున తప్పులు చేస్తుంటారు. తాజాగా ఆఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓ తప్పు చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. సారథిగా ఎంతో అనుభవం ఉన్న రోహిత్ కు ఈ మాత్రం తెలీదా? అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇంతకీ రోహిత్ చేసిన తప్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-ఆఫ్గాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ హష్మతుల్లా షహిదీ(80), అజ్మతుల్లా ఒమర్ జై(62) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో సత్తా చాటగా.. పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దానికి కారణం అతడి ఫీల్డ్ సెటప్. కెప్టెన్ గా ఎంతో అనుభవం ఉన్న రోహిత్ కు పవర్ ప్లేలో ఎంత మంది సర్కిల్ లోపల ఉండాలో, ఎంత మంది బయట ఉండాలో తెలీదా? అంటూ కామెంట్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేయడానికి వచ్చాడు స్టార్ ఆల్ రౌండర్ జడేజా. ఈ క్రమంలో 4 భారత ఫీల్డర్లు సర్కిల్ లోపల ఉన్నారు. ఇది గమనించిన ఆఫ్గాన్ కెప్టెన్ ఫీల్డ్ అంపైర్ కు పరిగెత్తుకొచ్చి చెప్పాడు. దీంతో అంపైర్ జడేజా వేసిన బంతిని నో బాల్ గా ప్రకటించాడు. ఆ బాల్ ను ఆఫ్గాన్ సారథి భారీ షాట్ కు ప్రయత్నించగా.. ఎడ్జ్ తీసుకుని బౌండరీకి తరలింది. ఇక ఫ్రీ హిట్ బాల్ ను కూడా భారీ షాట్ ఆడగా.. సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బాల్ ఫీల్డర్ చేతికి చిక్కింది. కాగా.. 10 నుంచి 40 ఓవర్ల మధ్యలో సర్కిల్ లో ఐదుగురు ప్లేయర్లు ఉండాలి. కానీ నలుగురే ఉన్నారు. ఈ విషయం రోహిత్ కు తెలీదా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఇలాంటి చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments