Virat Kohli: విరాట్ కోహ్లీకి ఘోర అవమానం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ఘోర అవమానం జరిగింది. ఈ విషయంపై కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి కోహ్లీకి జరిగిన అవమానం ఏంటి?

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ఘోర అవమానం జరిగింది. ఈ విషయంపై కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి కోహ్లీకి జరిగిన అవమానం ఏంటి?

ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 సిరీస్ ను సమం చేసుకుని, వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్.. ఇదే ఊపులో టెస్ట్ సిరీస్ ను దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. కానీ సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా రన్ మెషిన్ 38 పరుగులు చేసి విఫలం అయ్యాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి ఘోర అవమానం జరిగింది. ఈ విషయంపై కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి కోహ్లీకి జరిగిన అవమానం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రతి సంవత్సరం ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన జట్లను ప్రకటిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా స్టార్ స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ది వన్డే, టెస్ట్ జట్లను ప్రకటించింది. అయితే వన్డే టీమ్ లో ఏకంగా 8 మంది భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా లకు చోటు దక్కిన విషయం తెలిసిందే. వన్డేలతో పాటుగా టెస్టు జట్టును కూడా ప్రకటించింది స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం. ఈ జట్టులో టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి చోటు దక్కలేదు. దాంతో ఇది విరాట్ కోహ్లీకి జరిగిన దారుణ అవమానం అంటూ ఫ్యాన్స్ స్టార్ స్పోర్ట్స్ పై మండిపడుతున్నారు.

కాగా.. ఈ సంవత్సరం టెస్టుల్లో మిడిలార్డర్ బ్యాటర్ గా కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది 8 టెస్టులు ఆడిన విరాట్ 54.09 సగటుతో 595 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. అద్భుతమైన యావరేజ్ ఉన్నప్పటికీ కోహ్లీకి చోటు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు..”ఈ విషయం నాకు షాకింగ్ గా ఉంది. టెస్టుల్లో ఈ ఏడాది దాదాపు 55 బ్యాటింగ్ యావరేజ్ ఉన్న విరాట్ కోహ్లీకి టెస్ట్ ఇయర్ ఆఫ్ ది టీమ్ లో చోటు దక్కకపోవడం నిజంగా ఆశ్చర్యకరం” అంటూ ఓ జాతీయ ఛానల్ తో చెప్పుకొచ్చాడు. కాగా.. ఇంత మంచి సగటు ఉన్నా కోహ్లీకి ఈ జట్టులో చోటు దక్కకపోవడం.. ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో స్టార్ స్పోర్ట్స్ పై ఫైర్ అవుతున్నారు. మరి విరాట్ కోహ్లీకి టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లో చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

స్టార్ స్పోర్ట్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్:

రోహిత్ శర్మ, ఉస్మాన్ ఖవాజా, జో రూట్, ట్రావిస్ హెడ్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్, ప్యాట్ కమ్మిన్స్.

Show comments