iDreamPost
android-app
ios-app

Ritika, Anushka: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ మధ్య మరో వార్! ఈసారి భార్యల పరువు తీస్తూ!

  • Published Feb 06, 2024 | 4:21 PM Updated Updated Feb 06, 2024 | 4:49 PM

సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్లు సహజమే. ముఖ్యంగా రోహిత్‌-కోహ్లీ అభిమానుల మధ్య తరుచుగా ఈ ఫైట్‌ జరుగుతూ ఉంటుంది. కానీ, అది ఈ సారి కాస్త శృతి మించి.. వారి భార్యలను కూడా ఇందులోకి లాగారు. ఆ గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్లు సహజమే. ముఖ్యంగా రోహిత్‌-కోహ్లీ అభిమానుల మధ్య తరుచుగా ఈ ఫైట్‌ జరుగుతూ ఉంటుంది. కానీ, అది ఈ సారి కాస్త శృతి మించి.. వారి భార్యలను కూడా ఇందులోకి లాగారు. ఆ గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 06, 2024 | 4:21 PMUpdated Feb 06, 2024 | 4:49 PM
Ritika, Anushka: రోహిత్, కోహ్లీ  ఫ్యాన్స్ మధ్య మరో వార్! ఈసారి భార్యల పరువు తీస్తూ!

ఇండియన్‌ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ-విరాట్‌ కోహ్లీ ఇద్దరూ సూపర్‌ స్టార్లు. ఒకరు మాజీ కెప్టెన్‌ అయితే, మరొకరు ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నారు. అయితే.. వీరిద్దరు గ్రౌండ్‌లో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, వీరిద్దరికి అస్సలు పడదని, ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీన్ని బేస్‌ చేసుకుని.. సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్‌ కూడా జరుగుతూ ఉంటుంది. కోహ్లీ-రోహిత్‌ ఫ్యాన్స్‌ మధ్య సోషల్‌ మీడియాలో అనేక సార్లు చాలా విషయాలపై ఫ్యాన్‌ వార్‌ జరిగింది. కోహ్లీని రోహిత్‌ అభిమానులు, రోహిత్‌ను కోహ్లీ అభిమానులు ట్రోల్‌ చేస్తూ ఉంటారు. రికార్డుల విషయంలో, ఆట విషయంలో ఈ ట్రోలింగ్‌ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రోలింగ్‌ హద్దు మీరి.. కోహ్లీ-రోహిత్‌ భార్యల దాకా వెళ్లింది. తాజాగా ట్విట్టర్‌లో ఇద్దరు అభిమానులు రితికా, అనుష్క శర్మలను ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పుడీ రచ్చ ఎందుకు జరుగుతుందో చూద్దాం..

రెండు నెలల క్రితం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి, అతని స్థానంలో హార్ధిక్‌ పాండ్యాను నియమించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పెద్ద రచ్చ జరిగింది. చాలా మంది రోహిత్‌ అభిమానులు ముంబై ఇండియన్స్‌ ఇన్‌స్టా అకౌంట్‌ను అన్‌ఫాలో చేశారు. ముంబై యాజమాన్యంపై, పాండ్యాపై దుమ్మెత్తిపోశారు. అయితే.. తాజాగా ఈ విషయంపై ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ స్పందిస్తూ.. రోహిత్‌ను తప్పించి, పాండ్యాను కెప్టెన్‌ చేయడానికి గల కారణాలు ఇవే అంటూ చెప్పుకోచ్చాడు. రోహిత్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ముంబై మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుందని, ఇదో క్రికెటింగ్‌ డిసిషన్‌ అంటూ పేర్కొన్నాడు. బౌచర్‌ వ్యాఖ్యలపై రోహిత్‌ భార్య రితికా స్పందిస్తూ.. అవన్ని అబద్ధాలు అంటూ ఇన్‌స్టాలో కామెంట్‌ చేసింది. ఆ కామెంటే ఇప్పుడు రితికా వర్సెస్‌ అనుష్క శర్మ వార్‌గా మారింది.

భర్త కెప్టెన్సీ పోతే.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై రితికా ఏడుస్తుందంటూ.. కొంతమంది కోహ్లీ అభిమానులు సోషల్‌ మీడియాలో రితికాను ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. టీమిండియా కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించినప్పుడు అనుష్క శర్మ ఎక్కడా స్పందించలేదని, కానీ, రితికా మాత్రం సోషల్‌ మీడియాలో గొడవకు దిగుతుందంటూ ట్రోల్‌ చేశారు. దీనికి రోహిత్‌ అభిమానులు కౌంటర్‌ ఇస్తూ.. గతంలో సునీల్‌ గవాస్కర్‌ కోహ్లీ బ్యాడ్‌ ఫామ్‌పై కామెంట్‌ చేసినప్పుడు అనుష్క శర్మ ఇంత పెద్ద పేరా రాసుకొచ్చిందని రివర్స్‌ ట్రోలింగ్‌ దిగారు. ఇలా కోహ్లీ-రోహిత్‌ అభిమానులు.. ట్విట్టర్‌ ఫైట్‌లో అనుష్క శర్మ-రితికాను లాక్కొచ్చారు. మరి ఈ ఫ్యాన్‌వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet