ధోని కోసం గ్రౌండ్ లోకి వచ్చిన ఈ ఫ్యాన్.. ఇప్పుడు నరకం చూస్తున్నాడు!

శుక్రవారం జరిగిన గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోనిని కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చాడు ఓ వీరాభిమాని. ఇప్పుడు అతడు నరకం చూస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

శుక్రవారం జరిగిన గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోనిని కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చాడు ఓ వీరాభిమాని. ఇప్పుడు అతడు నరకం చూస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రికెటర్లపై తమకు ఉన్న పిచ్చి ప్రేమను ఫ్యాన్స్ పలు రకాలుగా తెలియజేస్తూ ఉంటారు. ఇక మ్యాచ్ జరిగేటప్పుడు పటిష్టమైన పోలీసు, గ్రౌండ్ భద్రతను దాటుకుని మరీ తమ అభిమాన ఆటగాళ్లను కలిసి, షేక్ హ్యాడ్, హగ్ ఇస్తుంటారు ఫ్యాన్స్. ఒక్కసారి తాము ఆరాధించే ప్లేయర్ చేయి తాకితే చాలు అనుకుంటారు. ఇక ఇలాంటి సంఘటనలు చరిత్రలో కోకొల్లలుగా చూశాం. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో సైతం ప్లేయర్లను కలిసేందుకు గ్రౌండ్ లోకి దూసుకొచ్చారు కూడా. ఇక ఇటీవలే ముగిసిన గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోనిని కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చాడు ఓ వీరాభిమాని. ఇప్పుడు అతడు నరకం చూస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024 సీజన్ లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడింది చెన్నైసూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో గుజరాత్ టీమ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ చేస్తున్న టైమ్ లో పటిష్టమైన పోలీసుల భద్రతను దాటుకుని గ్రౌండ్ లోకి రాకెట్ వేగంతో దూసుకొచ్చాడు ధోని వీరాభిమాని. ధోని పాదాలను తాకి, గట్టిగా అతడిని హగ్ చేసుకున్నాడు. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి ఆ కుర్రాడిని తీసుకుని వెళ్లారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఆ కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు జయ్ కుమార్ జానీ, భావ్ నగర్ జిల్లాకు చెందిన రబారిక గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న జయ్ కుమార్ కు ధోని అంటే విపరీతమైన పిచ్చి.. అందుకే అతడిని ఎలాగైనా కలవాలని, వచ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దని ఇలా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ధోనిపై అభిమానమే తప్ప ఇంకో ఉద్దేశం లేదని పోలీసులు వివరించారు. ఐపీసీ 447 సెక్షన్ ప్రకారం అతడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ డీవీ రానా తెలిపారు.

కాగా.. జయ్ కుమార్ ధోనిని కలిశాడని, అతడంత అదృష్టవంతుడు ఎవ్వరూ లేని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జయ్ కుమార్ లక్కీ పర్సన్ అంటూ పొడుగుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ధోనిని కలిసినందుకు అరెస్ట్ అయిన జయ్ ఇప్పుడు నరకం చూస్తున్నాడు. అతడిపై కేసు నమోదు అయితే.. తన చదువుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న అతడికి ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు ఈ కేసు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. మరి ధోనిని కలిసినందుకు అరెస్ట్ అయ్యి.. ఇబ్బందులు పడుతున్న ఫ్యాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments