James Anderson: వీడియో: చివరి టెస్టులో అండర్సన్‌ సూపర్‌ బాల్‌! అందుకే GOAT అనేది!

లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ చివరి టెస్టు ఆడేశాడు. వెస్టిండీస్​తో లార్డ్స్​ వేదికగా జరిగిన టెస్ట్​ మ్యాచ్​తో సుదీర్ఘ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు. అయితే ఆఖరి మ్యాచ్​లో కూడా అతడు అంతే దీటుగా బౌలింగ్ చేయడం విశేషం.

లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ చివరి టెస్టు ఆడేశాడు. వెస్టిండీస్​తో లార్డ్స్​ వేదికగా జరిగిన టెస్ట్​ మ్యాచ్​తో సుదీర్ఘ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు. అయితే ఆఖరి మ్యాచ్​లో కూడా అతడు అంతే దీటుగా బౌలింగ్ చేయడం విశేషం.

లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ చివరి టెస్టు ఆడేశాడు. వెస్టిండీస్​తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టుతో సుదీర్ఘ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు. అయితే ఆఖరి మ్యాచ్​లో కూడా అతడు అంతే దీటుగా బౌలింగ్ చేయడం విశేషం. లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్​లో 10 ఓవర్లు వేసి 1 వికెట్ మాత్రమే తీశాడు అండర్సన్. అయితే రెండో ఇన్నింగ్స్​లో మాత్రం చెలరేగిపోయాడు. 16 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. విండీస్ ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్​వైట్​తో పాటు అలిక్ అతాన్జే, జోషువా డసిల్వాను ఔట్ చేశాడీ ఇంగ్లండ్ బౌలర్. అండర్సన్ ఏకంగా 7 మెయిడిన్లు వేయడం విశేషం. క్రెయిగ్​ను అతడు ఔట్ చేసిన విధానం మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది.

అండర్సన్ వేసిన బంతి ఆఫ్​స్టంప్​కు బయట పడగా దాన్ని డిఫెన్స్ చేయబోయాడు క్రెయిగ్. కానీ లేట్​గా ఆడటంతో బంతి అతడి బ్యాట్​ను దాటుకొని వెళ్లి వికెట్లను గిరాటేసింది. బాల్ అంత స్వింగ్ అవుతుందని క్రెయిగ్ ఊహించలేదు. ఈ వికెట్​తో పాటు మరో ఇద్దరు విండీస్ బ్యాటర్లను అండర్సన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 188 టెస్టులు ఆడాక కూడా ఇంత పవర్​ఫుల్ బౌలింగ్ వేయడం అంటే మాటలు కాదంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇప్పుడే ఇలా బౌలింగ్ చేస్తున్నాడంటే కెరీర్ పీక్​లో ఉన్నప్పుడు అండర్సన్ ఏ లెవల్​లో బ్యాటర్లతో ఆడుకున్నాడో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అందుకే అతడ్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి అండర్సన్​కు గ్రేట్ ఫేర్​వెల్ ఇచ్చింది. మరి.. అండర్సన్ సూపర్ బాల్​ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments