Nidhan
టీ20 వరల్డ్ కప్‌లో క్రికెటర్లు అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. మెగాటోర్నీలో ఇప్పటివరకు ఎన్నో మంచి క్యాచులు చూశాం. అయితే ఇది మాత్రం వాటి కంటే బెస్ట్ క్యాచ్ అనే చెప్పాలి.
టీ20 వరల్డ్ కప్‌లో క్రికెటర్లు అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. మెగాటోర్నీలో ఇప్పటివరకు ఎన్నో మంచి క్యాచులు చూశాం. అయితే ఇది మాత్రం వాటి కంటే బెస్ట్ క్యాచ్ అనే చెప్పాలి.
Nidhan
టీ20 వరల్డ్ కప్‌లో క్రికెటర్లు అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. మెగాటోర్నీలో ఇప్పటివరకు ఎన్నో మంచి క్యాచులు చూశాం. అయితే ఇది మాత్రం వాటి కంటే బెస్ట్ క్యాచ్ అనే చెప్పాలి. సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ జాస్ బట్లర్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ప్రొటీస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 65) ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ల వెనుక ఉన్న బట్లర్ డైవ్ చేసి పట్టుకున్నాడు. పక్షి మాదిరిగా గాలిలో ఎగురుతూ బాల్‌ను ఒడిసిపట్టాడు. బట్లర్ ఉన్న పొజిషన్‌కు బాల్ పట్టుకోవడం చాలా కష్టం. అది దూరంగా వెళ్తోంది. కానీ ఆఖరి వరకు దాని మీదే దృష్టి నిలిపిన ఇంగ్లండ్ సారథి.. అమాంతం సూపర్‌మ్యాన్ మాదిరిగా గాలిలోకి డైవ్ చేసి బాల్‌ను అందుకున్నాడు.
బట్లర్ క్యాచ్ చూసి డికాక్ షాకయ్యాడు. నమ్మకశక్యం కాని విధంగా బంతిని అందుకోవడంతో నిరాశతో క్రీజును వీడాడు. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఒక దశలో 100 పరుగులకు 2 వికెట్లతో పటిష్టంగా కనిపించిన ఆ జట్టు.. ఈజీగా 180 మార్క్‌ను చేరుకుంటుందని అంతా భావించారు. కానీ వెంటవెంటనే వికెట్లు పడటంతో భారీ స్కోరు చేయలేకపోయింది. సౌతాఫ్రికా టీమ్‌లో డికాక్‌తో పాటు డేవిడ్ మిల్లర్ (28 బంతుల్లో 43) రాణించాడు. అటు ఇంగ్లీష్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. డికాక్, మిల్లర్‌ను ఔట్ చేసి ప్రత్యర్థి జట్టును చావు దెబ్బ తీశాడు. మరి.. బట్లర్ క్యాచ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
JOS BUTTLER IS A BIRD. 🦅 pic.twitter.com/B9ZdJvW15m
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024