iDreamPost

వీడియో: వరల్డ్ కప్​లో ఇదే బెస్ట్ క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా!

  • Published Jun 21, 2024 | 10:00 PMUpdated Jun 21, 2024 | 10:00 PM

టీ20 వరల్డ్ కప్​లో క్రికెటర్లు అద్భుతమైన ఫీల్డింగ్​తో ఆకట్టుకుంటున్నారు. మెగాటోర్నీలో ఇప్పటివరకు ఎన్నో మంచి క్యాచులు చూశాం. అయితే ఇది మాత్రం వాటి కంటే బెస్ట్ క్యాచ్ అనే చెప్పాలి.

టీ20 వరల్డ్ కప్​లో క్రికెటర్లు అద్భుతమైన ఫీల్డింగ్​తో ఆకట్టుకుంటున్నారు. మెగాటోర్నీలో ఇప్పటివరకు ఎన్నో మంచి క్యాచులు చూశాం. అయితే ఇది మాత్రం వాటి కంటే బెస్ట్ క్యాచ్ అనే చెప్పాలి. సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్​లో ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ జాస్ బట్లర్ సూపర్ క్యాచ్​ అందుకున్నాడు. ప్రొటీస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 65) ఇచ్చిన క్యాచ్​ను వికెట్ల వెనుక ఉన్న బట్లర్ డైవ్ చేసి పట్టుకున్నాడు. పక్షి మాదిరిగా గాలిలో ఎగురుతూ బాల్​ను ఒడిసిపట్టాడు. బట్లర్ ఉన్న పొజిషన్​కు బాల్ పట్టుకోవడం చాలా కష్టం. అది దూరంగా వెళ్తోంది. కానీ ఆఖరి వరకు దాని మీదే దృష్టి నిలిపిన ఇంగ్లండ్ సారథి.. అమాంతం సూపర్​మ్యాన్ మాదిరిగా గాలిలోకి డైవ్ చేసి బాల్​ను అందుకున్నాడు.

బట్లర్ క్యాచ్​ చూసి డికాక్ షాకయ్యాడు. నమ్మకశక్యం కాని విధంగా బంతిని అందుకోవడంతో నిరాశతో క్రీజును వీడాడు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఒక దశలో 100 పరుగులకు 2 వికెట్లతో పటిష్టంగా కనిపించిన ఆ జట్టు.. ఈజీగా 180 మార్క్​ను చేరుకుంటుందని అంతా భావించారు. కానీ వెంటవెంటనే వికెట్లు పడటంతో భారీ స్కోరు చేయలేకపోయింది. సౌతాఫ్రికా టీమ్​లో డికాక్​తో పాటు డేవిడ్ మిల్లర్ (28 బంతుల్లో 43) రాణించాడు. అటు ఇంగ్లీష్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో మ్యాచ్​ను మలుపు తిప్పాడు. డికాక్, మిల్లర్​ను ఔట్ చేసి ప్రత్యర్థి జట్టును చావు దెబ్బ తీశాడు. మరి.. బట్లర్ క్యాచ్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి