Moeen Ali: క్రికెట్​కు గుడ్​బై చెప్పిన మొయిన్ అలీ.. మళ్లీ వెనక్కి రానంటూ..!

Moeen Ali Announces Retirement: ఇంగ్లండ్ క్రికెట్​కు ఎంతో సేవలు అందించిన దిగ్గజ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై ఆడేది లేదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మళ్లీ వెనక్కి రానని చెప్పాడు.

Moeen Ali Announces Retirement: ఇంగ్లండ్ క్రికెట్​కు ఎంతో సేవలు అందించిన దిగ్గజ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై ఆడేది లేదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మళ్లీ వెనక్కి రానని చెప్పాడు.

ఇంగ్లండ్ క్రికెట్​కు ఎంతో సేవలు అందించిన ఓ స్టార్ ఆల్​రౌండర్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ జట్టుకు అన్ని ఫార్మాట్లలోనూ దశాబ్ద కాలం పాటు కీలకంగా ఉంటూ వస్తున్న ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. బ్యాటింగ్​లో హార్డ్ హిట్టింగ్​తో విలువైన పరుగులు చేసే ఆ ఆటగాడు.. బౌలింగ్​లో కీలక బ్రేక్ త్రూలు అందిస్తూ టీమ్ విజయాల్లో ఎంతో కీలకంగా ఉంటూ వచ్చాడు. అలాంటోడు ఇక మీదట గ్రౌండ్​లో కనిపించనని స్పష్టం చేశాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. మొయిన్ అలీ. ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెబుతున్నట్లు అతడు తాజాగా వెల్లడించాడు. ఈ సందర్భంగా అతడు ఎమోషనల్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్​ నుంచి రిటైర్ అవుతున్నా తనకేమీ బాధ లేదంటూనే.. ఇప్పటికీ క్రికెట్ ఆడగలనని అన్నాడు మొయిన్ అలీ. అతడు ఇంకా ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమ్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ డెసిషన్ తీసుకున్నానని మొయిన్ అలీ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని భావించానని స్పష్టం చేశాడు. కొత్త తరం ఇంగ్లండ్ టీమ్​లోకి రావాల్సిన టైమ్ వచ్చేసిందని.. అందుకే తాను పక్కకు జరగాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఇప్పటికే ఇంగ్లీష్ టీమ్ తరఫున చాలా క్రికెట్ ఆడేశానని పేర్కొన్నాడు మొయిన్ అలీ. ఆస్ట్రేలియాతో జరిగే లిమిటెడ్ ఓవర్స్ సిరీస్​కు తనను సెలెక్ట్ చేయలేదని.. మున్ముందు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదన్నాడు. ఇంగ్లండ్ తరఫున ఆడిన ప్రతి మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న స్టార్ ఆల్​రౌండర్.. ఇన్నేళ్ల జర్నీలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. యంగ్ జనరేషన్ ఇంగ్లండ్ టీమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు నడిపించాలన్నాడు.

ఇక, 2014లో ఇంగ్లండ్ తరఫున డెబ్యూ ఇచ్చిన మొయిన్ అలీ.. ఈ పదేళ్ల కాలంలో 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,600కు పైగా రన్స్ చేశాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన అలీ 360కు పైగా వికెట్స్ తీశాడు. 37 ఏళ్ల ఈ ఆల్​రౌండర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఆ జట్టు తరఫున 67 మ్యాచుల్లో కలిపి 1,162 పరుగులు, 35 వికెట్లు తీశాడు. ఇక, రీసెంట్​గా జరిగిన టీ20 వరల్డ్ కప్​లో టీమిండియాతో ఆడిన సెమీఫైనల్ మ్యాచ్​ అలీకి చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్​ అని చెప్పాలి. ఆసీస్​తో సిరీస్​లో ఆడాలని అనుకున్నా అతడ్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడు గేమ్​కు గుడ్​బై చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్​తో టీమ్​కు వెన్నెముకలా వ్యవహరించిన మొయిన్ అలీ లాంటి స్పిన్ ఆల్​రౌండర్​ టీమ్​కు దొరకడం చాలా కష్టం. ఈ లోటును ఇంగ్లండ్ ఎలా భర్తీ చేస్తుందో చూడాలి. మరి.. మొయిన్ అలీ రిటైర్మెంట్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments