SNP
England, IPL 2024: ఐపీఎల్ 2024 మంచి రతవత్తరంగా సాగుతున్న టైమ్‌లో క్రికెట్ అభిమానులతో పాటు ఓ నాలుగు టీమ్స్‌కు బ్యాడ్ న్యూస్ అందింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
England, IPL 2024: ఐపీఎల్ 2024 మంచి రతవత్తరంగా సాగుతున్న టైమ్‌లో క్రికెట్ అభిమానులతో పాటు ఓ నాలుగు టీమ్స్‌కు బ్యాడ్ న్యూస్ అందింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్‌కు ఎవరు వెళ్లారు అనే దానిపై అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ టీమ్ ఒక్కటే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. రెండు టీమ్స్.. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు అఫీషియల్‌గా ఎలిమినేట్ అయ్యాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో పటిష్టంగా ఉంటే.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆరు జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధం అవుతుండటంతో.. ఓ రెండు జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.
ఇంగ్లండ్ ఆటగాళ్లు మొయిన్ అలీ, బెయిర్‌స్టో, జోస్ బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీలు వచ్చే వారంలో స్వదేశానికి వెళ్లనున్నట్లు సమాచారం. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి కాస్త ముందుగానే రిలీవ్ కానున్నారు. అయితే.. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న, ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఎక్కువ ఉన్న టీమ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు కీలకంగా మారారు. దీంతో.. ఎంతో కీలకమైన ప్లే ఆఫ్స్‌లో వీళ్లు లేకపోతే.. ఆ జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడునుంది. మరి ఇంగ్లండ్ ఆటగాళ్లు లేకపోవడంతో ఇబ్బంది పడే టీమ్స్ ఏవంటే…
కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్.. ఈ రెండు జట్లకు ఓపెనర్లుగా ఉన్న ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ఇద్దరు వెళ్లిపోతే.. రెండు టీమ్స్ కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ఓపెనింగ్ జోడీ సెట్ కాకపోతే.. ఇబ్బందుల ఎదురు కావొచ్చు. ఈ రెండు టీమ్స్‌తో పాటు.. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇబ్బంది పడొచ్చు. మొయిన్ అలీ సీఎస్‌కేకి, విల్ జాక్స్ ఆర్సీబీకి కీ ప్లేయర్లుగా ఉన్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య ఈ నెల 18న నాకౌట్ తరహా మ్యాచ్ ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు వాళ్లు అందుబాటులో ఉంటే ఓకే. లేకుంటే.. ఈ రెండు టీమ్స్ కూడా ఇబ్బంది పడొచ్చు. అలాగే ఈ రెండు టీమ్స్‌లో ఒక్క టీమ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్తే.. అప్పుడు కూడా ఇబ్బంది తప్పకపోవచ్చు. అయితే.. ఇంగ్లండ్ ఆటగాళ్లు పూర్తి ఐపీఎల్ ఆడేలా.. బీసీసీఐ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులో చర్చలు జరిపినప్పటికీ.. చర్చలు సఫలం కాలేదని తెలుస్తోంది. మరి ఇంగ్లండ్ ప్లేయర్లు లేకపోతే.. కేకేఆర్, ఆర్‌ఆర్, ఆర్సీబీ, సీఎస్‌కే ఎంత వరకు ఇబ్బంది పడొచ్చని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Moeen Ali, Bairstow, Buttler, Sam Curran, Will Jacks, Phil Salt & Reece Topley will begin to return home in the next few days & they are expected to be back in the UK this weekend. [Espn Cricinfo] pic.twitter.com/zOc91UEyyl
— Johns. (@CricCrazyJohns) May 13, 2024