iDreamPost
android-app
ios-app

ప్రియురాలిని పెళ్లాడిన మహిళా స్టార్ క్రికెటర్.. వైరలవుతున్న ఫొటోలు!

  • Published Jun 11, 2024 | 4:15 PM Updated Updated Jun 11, 2024 | 4:15 PM

ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తన ప్రియురాలు జార్జి హాడ్జ్ ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి లండన్ లో ఘనంగా జరిగింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ జంట. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తన ప్రియురాలు జార్జి హాడ్జ్ ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి లండన్ లో ఘనంగా జరిగింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ జంట. మరిన్ని వివరాల్లోకి వెళితే..

  • Published Jun 11, 2024 | 4:15 PMUpdated Jun 11, 2024 | 4:15 PM
ప్రియురాలిని పెళ్లాడిన మహిళా స్టార్ క్రికెటర్.. వైరలవుతున్న ఫొటోలు!

నేటి కాలంలో స్వలింగ సంపర్క వివాహాలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే వీరిలో ఎక్కువగా సెలబ్రిటీలే ఉండటం గమనార్హం. తాజాగా తన ప్రియురాలు జార్జి హాడ్జ్ ను వివాహం చేసుకుంది ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్. జూన్ 10న లండన్ లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్ లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ జంట. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తన ప్రియురాలు జార్జి హాడ్జ్ ను వివాహం చేసుకుంది. జూన్ 10న వీరి పెళ్లి లండన్ లో ఘనంగా జరిగింది. కాగా.. 2023లో మార్చిలో దక్షిణాఫ్రికాలో వీరిద్దరు ఎంగేజ్ మెంట్ చేసుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. జార్జి హాడ్జ్ CCAకు చెందిన ఓ మహిళా ఫుట్ బాల్ జట్టుకు హెడ్ గా కొనసాగుతున్నారు. లండన్ లో FA లైసెన్స్ డ్ ఏజెంట్ గా వ్యవహరిస్తోంది.

కాగా.. 2019 నుంచి ఈ జంట డేటింగ్ చేస్తోంది. ఇక 33 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 2 టెస్టులు, 105 వన్డేలు, 151 టీ20లు ఆడింది. ఇక 2014లో విరాట్ కోహ్లీకి సరదాగా ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా.. 2022లో ఇంగ్లండ్ కే చెందిన కేథరిన్ బ్రంట్-నటాలియా సీవర్ లు పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు కివీస్ మహిళా క్రికెటర్లు సాటర్త్ వైట్-తహుహు, దక్షిణాఫ్రికా ప్లేయర్లు మారిజెన్ కాంప్-డాన్ నీకెర్క్ లు పెళ్లితో ఒక్కటైయ్యారు. మరి ప్రియురాలిని మహిళా స్టార్ క్రికెటర్ పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Georgie Hodge (@georgiehodge)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş