iDreamPost
android-app
ios-app

స్టార్‌ క్రికెటర్లు ఆడుతున్న దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఫ్రీగా చూసేయండి ఇలా!

  • Published Aug 16, 2024 | 1:18 PM Updated Updated Aug 16, 2024 | 1:18 PM

Duleep Trophy 2024, Jiocinema: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు బరిలోకి దిగుతున్న దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ల లైవ్‌ను ఉచితంగా చూసే అవకాశం ఉంది. అది ఎలా చూడాలో తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్‌ పూర్తిగా చదివేయండి..

Duleep Trophy 2024, Jiocinema: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు బరిలోకి దిగుతున్న దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ల లైవ్‌ను ఉచితంగా చూసే అవకాశం ఉంది. అది ఎలా చూడాలో తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్‌ పూర్తిగా చదివేయండి..

  • Published Aug 16, 2024 | 1:18 PMUpdated Aug 16, 2024 | 1:18 PM
స్టార్‌ క్రికెటర్లు ఆడుతున్న దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఫ్రీగా చూసేయండి ఇలా!

దేశవాళి క్రికెట్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ.. దులీప్‌ ట్రోఫీని ఈ ఏడాది బీసీసీఐ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభం అయిన నాటి నుంచి జరుగుతున్న విధానాన్ని మార్చి.. కొత్త పద్ధతిలో నిర్వహించేందుకు రెడీ అయింది బీసీసీఐ. గతంలో 6 జట్ల మధ్య జరిగే ఈ టోర్నీని.. ఈ సారి 4 టీమ్స్‌తోనే జరపనుంది. అంతర్జాతీయ రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో మెరుగ్గా రాణించేందుకు.. టీమిండియా యువ క్రికెటర్లకు ఒక పరీక్షల ఈ టోర్నీని నిర్వహిస్తోంది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు, యువ క్రికెటర్లు తలపడుతుండటంతో భారత క్రికెట్‌ అభిమానులు కూడా.. ఈ టోర్నీపై ఆసక్తి చూపుతున్నారు.

స్టార్‌ క్రికెటర్లు శుబ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌, రిషభ్‌ పంత్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌ తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి స్టార్లంతా.. చాలా కాలం తర్వాత దులీప్‌ ట్రోఫీలో ఆడుతున్నారు. మరి ఈ స్టార్లు తలపడే ఈ దులీప్‌ ట్రోఫీ లైవ్‌ ఎందులో వస్తుంది? లైవ్‌ ఫ్రీగా ఎందులో చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. టీమిండియా అధికారిక బ్రాడ్‌ కాస్టర్‌ స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో సినిమాలో ఈ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు.

dhulip trophy

సెప్టెంబర్‌ 5 నుంచి 19 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. నాలుగు టీమ్స్‌లను ఏ, బీ, సీ, డీగా డివైడ్‌ చేశారు. వీటిలో ఏ టీమ్‌కు శుబ్‌మన్‌ గిల్‌, బీ టీమ్‌కు అభిమన్యు ఈశ్వరన్‌, సీ టీమ్‌కు రుతురాజ్‌ గైక్వాడ్‌, డీ టీమ్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. మ్యాచ్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో, అనంతపురంలోని రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్టేడియం వేదికగా జరుగున్నాయి. ఈ మ్యాచ్‌లలో ప్రదర్శన ఆధారంగా బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపిక చేస్తామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. మరి దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్‌ ఫ్రీగా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş