Ishan Kishan: సెంచరీతో చెలరేగిన ఇషాన్! ఇది మామూలు ఇన్నింగ్స్ కాదు..

Ishan Kishan Smashed Century, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా బితో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టాడు. గాయం కారణంగా తొలి రౌండ్ కు దూరమైన ఇషాన్.. ఈ మ్యాచ్ లో సత్తాచాటాడు.

Ishan Kishan Smashed Century, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా బితో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టాడు. గాయం కారణంగా తొలి రౌండ్ కు దూరమైన ఇషాన్.. ఈ మ్యాచ్ లో సత్తాచాటాడు.

ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ 2024లో టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అనంతపురం వేదికగా ఇండియా బితో జరుగుతున్న మ్యాచ్ లో ధనాధను ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గాయం కారణంగా తొలి రౌండ్ మ్యాచ్ కు దూరమైన ఇషాన్.. రెండో రౌండ్ లో ఇండియా సి తరఫున బరిలోకి దిగాడు. ఇక ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొంటూ.. 120 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. దాంతో తన టీమ్ భారీ స్కోర్ సాధించేందుకు బాటలు వేశాడు.

దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా బితో జరుగుతున్న మ్యాచ్ లో శతకంతో దుమ్మురేపాడు టీమిండియా యువ వికెట్ కీపర్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్. అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్(43), రజత్ పాటిదార్(40) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ కు చేరడంతో.. క్రీజ్ లోకి అడుగుపెట్టాడు ఇషాన్. ప్రత్యర్థి పైచేయి సాధిస్తుందన్న తరుణంలో తన ఆటతో తమ టీమ్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ క్రమంలోనే 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్.. ఆ తర్వాత కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగించాడు. బాబా ఇంద్రజిత్ తో కలిసి అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 120 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు ఇషాన్. తన సత్తా ఏంటో టీమిండియా సెలెక్టర్లకు చూపించాడు.

ఇక ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 126 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 111 పరుగులు చేసి ముకేశ్ కుమార్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు ఇషాన్. స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సెంచరీతో ఆదుకున్నాడు ఇషాన్. దాంతో ఇది మామూలు ఇన్నింగ్స్ కాదు అంటూ.. ఇషాన్ ఫ్యాన్స్ తో పాటుగా క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇషాన్ దులీప్ ట్రోఫీ కోసం మెుదట ఇండియా డి జట్టుకు ఎంపికైయ్యాడు. కానీ గాయ పడ్డాడని అతడి స్థానంలో సంజూ శాంసన్ ను ఎంపిక చేసింది. అయితే బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన తర్వాత తొలి టెస్ట్ కు సెలెక్ట్ అయిన ప్లేయర్లు వెళ్లిపోవడంతో.. తాజాగా అప్డేటెడ్ టీమ్స్ ను ప్రకటించింది. అయితే అందులో ఇషాన్ పేరులేదు. కానీ అతడు ఇండియా సి తరఫున బరిలోకి దిగి సెంచరీతో కదం తొక్కాడు. మరి ఇషాన్ కిషన్ సెంచరీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments