SNP
Hardik Pandya, Ajit Agarkar, Captaincy: రోహిత్ శర్మ వారుసుడిగా టీ20 కెప్టెన్ పగ్గాలు అందుకుంటాడు అనుకున్న హార్ధిక్ పాండ్యాకు నిరాశే మిగిలింది. అతని కెప్టెన్సీ దక్కకపోవడానికి భారత క్రికెటర్ల హస్తం ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Hardik Pandya, Ajit Agarkar, Captaincy: రోహిత్ శర్మ వారుసుడిగా టీ20 కెప్టెన్ పగ్గాలు అందుకుంటాడు అనుకున్న హార్ధిక్ పాండ్యాకు నిరాశే మిగిలింది. అతని కెప్టెన్సీ దక్కకపోవడానికి భారత క్రికెటర్ల హస్తం ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 విజయం తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. నెక్ట్స్ టీ20 కెప్టెన్ ఎవరంటూ తీవ్ర చర్చ జరిగింది. ఇంకెవరు టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యానే తర్వాత టీ20 కెప్టెన్ అంటూ ప్రచారం జరిగింది. పైగా హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో గతంలో టీమిండియా పలు సిరీస్‌లు ఆడింది ఉంది. పాండ్యాకు సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనే ట్యాగ్ ఉంది. ఐపీఎల్‌లో కూడా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఆ జట్టును తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2023లో గుజరాత్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ అయ్యాడు పాండ్యా. ఇలా అన్ని పాండ్యాకు పాజిటివ్‌గానే ఉన్నాయి.
ఇటీవలె ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా హార్ధిక్ పాండ్యా మంచి ప్రదర్శన చేయడం, బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ఆల్‌రౌండర్‌గా అదరగొట్టడం, ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో ఎంతో కీలకమైన చివరి ఓవర్ వేసి.. టీమిండియాకు విజయం అందించడంతో పాండ్యాపై ప్రశంసల వర్షం కురిసింది. ఇక పాండ్యాను టీ20 కెప్టెన్ కాకుండా ఎవరు అడ్డుకుంటారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా బీసీసీఐ టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించింది. పైగా హార్ధిక్ పాండ్యాకు ఉన్న వైస్ కెప్టెన్సీ పోస్ట్‌ను కూడా పీకేసింది. దీంతో.. పాండ్యాతో పాటు క్రికెట్ అభిమానులు షాక్ అయ్యాడు. అసలే భార్యతో విడాకులు తీసుకుని, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడుతున్న అతనికి బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పుండుమీద కారం చల్లినట్లు అయింది.
అయితే.. హార్ధిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ దక్కకపోవడానికి కారణం కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కారణంగానే పాండ్యాకు కెప్టెన్సీ దక్కలేదని వార్తలు వచ్చాయి. తాజాగా గంభీర్, అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో వెల్లడించిన ఒక విషయం ఆధారంగా.. హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ రాకపోవడానికి టీమిండియా క్రికెటర్ల హస్తం కూడా ఉందని తెలిసింది. అది ఎలాగంటే.. టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేసే ముందు భారత డ్రెస్సింగ్ రూమ్‌ని కూడా సంప్రదించి, వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఆ తర్వాతే సూర్యను కెప్టెన్‌గా నియమించినట్లు వెల్లడించాడు. అంటే.. టీమిండియా క్రికెటర్లు కూడా పాండ్యాను టీ20 కెప్టెన్‌గా వద్దని చెప్పినట్లే అర్థం. సో.. పాండ్యా కెప్టెన్ కాకపోవడానికి తన తోటి క్రికెటర్లు కూడా కారణమే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ajit Agarkar said, “dressing room feedback was also taken into consideration in deciding the T20i captain”. pic.twitter.com/4lCY6ycn3s
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2024