ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత​ జట్టును పాక్‌కు పంపొద్దు! BCCIకి డానిష్‌ కనేరియా సలహా

IND vs PAK, Champions Trophy 2025, Danish Kaneria, Team India: భారత జట్టును పాకిస్థాన్‌కు పంపొద్దని.. ఓ పాకి​స్థాన్‌ క్రికెటర్‌ బీసీసీఐకి హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చాడు. మరి ఎవరో క్రికెటర్‌ ఎందుకు అలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

IND vs PAK, Champions Trophy 2025, Danish Kaneria, Team India: భారత జట్టును పాకిస్థాన్‌కు పంపొద్దని.. ఓ పాకి​స్థాన్‌ క్రికెటర్‌ బీసీసీఐకి హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చాడు. మరి ఎవరో క్రికెటర్‌ ఎందుకు అలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాను పాకిస్థాన్‌కు పంపొద్దని.. ఇక్కడ పరిస్థితులు బాగా లేవంటూ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ బీసీసీఐని హెచ్చరించాడు. వచ్చే ఏడాది అంటే.. 2025 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌ వేదకిగా ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌ కోసం భారత జట్టు.. తమ దేశంలో పర్యటించాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు కోరుకుంటున్నారు. టీమిండియా తమ దేశానికి రాకుంటే.. ఇండియాలో జరిగే ఐసీసీ ఈవెంట్లకు మేం కూడా రామంటూ బ్లాక్‌మెయిలింగ్‌ ధోరణికి దిగుతున్నారు.

ఆటగాళ్ల భద్రతా కారణాల దృశ్యా పాకిస్థాన్‌కు టీమిండియాను పంపేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. ఒక వేళ పంపాలన్నా.. అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం అంటూ కూడా వెల్లడించింది. ఇప్పటికే ఐసీసీని కూడా ఛాంపియన్స్‌ ట్రోఫీ హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేలా చూడాలని రిక్వెస్ట్‌ చేసింది. యూఏఈలో టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించాలని కోరింది. కానీ, పాక్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం.. ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంలో స్పందించిన పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా.. టీమిండియాను ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు పంపొద్దని సూచించాడు.

టీమిండియా.. పాకిస్థాన్‌కు వచ్చి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడితే పాక్‌ క్రికెట్‌ బోర్డుకు భారీ ఆదాయం వస్తుందని, అలాగే మీడియాకు కూడా మంచి స్టఫ్‌ దొరుతుకుతుందని, అందుకే టీమిండియా రావాలని వాళ్లు పట్టుబడుతున్నట్లు కనేరియా పేర్కొన్నాడు. అయితే.. వీటన్నిటి కంటే.. భారత ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యమని, డబ్బు, రెస్పెక్ట్‌ గురించి కాకుండా.. భారత ఆటగాళ్ల భద్రత గురించి కూడా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆలోచించాలని, టీమిండియాకు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితుల్లో తాము ఉన్నామా లేమా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని సూచించాడు. వేరే టీమ్స్‌ పాకిస్థాన్‌కు రావడం వేరు, ఇండియా జట్టు రావడం వేరు.. అందుకే ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లోనే నిర్వహించాలని సూచించాడు. దుబాయ్‌ అయితే.. టీమిండియా మ్యాచ్‌లకు అనువుగా ఉంటుందని అన్నాడు. మరి కనేరియా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments