iDreamPost
android-app
ios-app

కోహ్లీ కొడుకు పేరు అకాయ్.. దీని అర్థం ఏంటో తెలుసా!

  • Published Feb 21, 2024 | 10:47 AM Updated Updated Feb 21, 2024 | 10:47 AM

భారత దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యారు. విరుష్క జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. కాగా కోహ్లీ తన కొడుకుకు అకాయ్ అని పేరు పెట్టారు. ఇంతకీ ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసా?

భారత దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యారు. విరుష్క జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. కాగా కోహ్లీ తన కొడుకుకు అకాయ్ అని పేరు పెట్టారు. ఇంతకీ ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసా?

  • Published Feb 21, 2024 | 10:47 AMUpdated Feb 21, 2024 | 10:47 AM
కోహ్లీ కొడుకు పేరు అకాయ్.. దీని అర్థం ఏంటో తెలుసా!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో సారి తండ్రైన విషయం తెలిసిందే. విరుష్క దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని కింగ్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈనెల 15న అనుష్క శర్మ మగ బిడ్డకు జన్మనివ్వగా.. ఈ విషయాన్ని కోహ్లీ నిన్న (మంగళవారం) వెల్లడించారు. ఎప్పటి నుంచో కోహ్లీ వారసుడొస్తున్నాడంటూ ఊహాగానాల నేపథ్యంలో విరాట్ చేసిన ప్రకటన ఫ్యాన్స్ కు ఎనలేని సంతోషాన్నిచ్చింది. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోహ్లీ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్ లో కింగ్ కోహ్లీకి ఫ్యాన్స్ ఎక్కువే. వారంతా విరాట్ కు వారసుడొచ్చిన వేళ స్వీట్స్ పంచుకుని వేడుకలా జరుపుకున్నారు. క్రికెట్ లో మరో సూపర్ స్టార్ రాబోతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మరోసారి తల్లిదండ్రులైన వేల విరుష్కా జంటకు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే కోహ్లీ తన కొడుకుకు అకాయ్ అని నామకరణం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ పేరుకు అర్థం ఏంటనే దానిపై పడింది. అకాయ్ పేరుకు అర్థం తెలుసుకునేందుకు నెటిజన్లు ఇంటర్నెట్ లో జల్లెడ పడుతున్నారు. మరి కోహ్లీ కొడుకు పేరు అకాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా.

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షిస్తూ తమ పిల్లలకు పేర్లు పెడుతుంటారు. ఈ విధంగానే కోహ్లీ తన కొడుకుకు అకాయ్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అకాయ్ పేరుకు సంబంధించిన అర్థాలను పలువురు పండితులు ఈ విధంగా వెల్లడిస్తున్నారు. సంస్కృత భాషలో అకాయ్ అంటే అమరుడు, చిరంజీవుడు అనే అర్థం ఉందని వెల్లడించారు. ఇక హిందీలో కాయ్‌ అంటే శరీరమని, అకాయ్‌ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని చెబుతున్నారు. టర్కీ భాషలో ఈ పదానికి కాంతులు వెదజల్లుతున్న చంద్రుడు అనే అర్థం కూడా ఉంటుందని తెలుపుతున్నారు. మరి వీటిలో ఏ అర్థాన్ని ఉద్దేశించి అకాయ్ అని పేరు పెట్టారో విరుష్క జంట ప్రకటిస్తే తప్పా అసలు నిజం ఏంటో తెలుస్తది. మరి కోహ్లీ తన కొడుకుకు అకాయ్ అని పేరు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet