యువరాజ్ సింగ్.. క్రికెట్ లవర్స్‌కు పరిచయం అక్కర్లేని పేరిది. భారత జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ అతను. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా అందుకోవడంలో యువీ పాత్రను ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌లలో భారత్ విశ్వవిజేతగా నిలవడంలో ఈ లెఫ్టాండర్ది మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. ఆ రెండు వరల్డ్ కప్స్‌లోనూ బౌలర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, ఫీల్డర్‌గా అద్భుతంగా రాణించాడు యువీ. బ్యాటుతో, బంతితో ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టించాడు.
2011 వన్డే వరల్డ్ కప్‌లోనైతే క్యాన్సర్ ఒకవైపు బాధిస్తున్నా ఓర్చుకొని జట్టు గెలుపు కోసం పోరాడాడు యువరాజ్. రెండు దశాబ్దాల పాటు భారత్‌కు సేవలు అందించిన ఈ లెజెండరీ ప్లేయర్ 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. యువీ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అందులో ఒకటి 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఆ మ్యాచ్ 16 బంతుల్లోనే యువీ 58 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. అతడు 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టింది ఈ మ్యాచ్‌లోనే. భారత్ నెగ్గిన ఈ మ్యాచ్‌లో యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు ఇప్పటిదాకా యువరాజ్ పేరు పైనే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ రికార్డును ఓ క్రికెటర్ బ్రేక్ చేశాడు. అతడే దీపేంద్ర సింగ్ ఐరీ. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో నేపాల్ బ్యాట్స్‌మన్ దీపేంద్ర 9 బంతుల్లోనే 50 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 బంతులు ఆడిన దీపేంద్ర 52 రన్స్ చేశాడు. అతడు ఏకంగా 8 సిక్సులు బాదడం విశేషం. దీపేంద్రతో పాటు కుషాల్ మల్లా (137) సెంచరీతో విజృంభించడంతో నేపాల్ 314 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనకు దిగిన మంగోలియా కేవలం 41 పరుగులకే కుప్పకూలింది. దీంతో నేపాల్ జట్టు టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టిస్తూ.. ఏకంగా 273 పరుగుల భారీ తేడా అతి పెద్ద విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు చూస్తే.. 9 బంతుల్లో హాఫ్ సెంచరీ, 34 బంతుల్లో సెంచరీ, వరుసగా 6 సిక్సులు, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు, టీ20 ఫార్మాట్‌లో భారీ విజయం నమోదు అయ్యాయి. మరి ఈ మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్ల విధ్వంసం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మూడో వన్డే కోసం లోకల్ ప్లేయర్లను దింపుతున్న భారత్!
DIPENDRA SINGH CREATED HISTORY…!!!
He smashed the fastest T20I fifty from just 9 balls in Asian Games against Mongolia – Broke the record of Yuvraj Singh from 12 balls. pic.twitter.com/rWuhiG4OTv
— Johns. (@CricCrazyJohns) September 27, 2023