టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌లో నేను సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేశా: భారత క్రికెటర్‌

T20 World Cup 2024, IND vs SA, Dhruv Jurel: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌లో ఇండియాకు కాకుండా సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేసినట్లు టీమిండియా క్రికెటర్‌ వెల్లడించాడు. అతను అలా ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం..

T20 World Cup 2024, IND vs SA, Dhruv Jurel: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌లో ఇండియాకు కాకుండా సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేసినట్లు టీమిండియా క్రికెటర్‌ వెల్లడించాడు. అతను అలా ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం..

17 ఏళ్ల తర్వాత భారత జట్టు రెండో సారి టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. వెస్టిండీస్‌లోని బార్బోడోస్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి.. పొట్టి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. రోహిత్‌ సేన కప్పు గెలవాలని వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానులు ఎన్నో ప్రార్థనలు చేశారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఓ టీమిండియా క్రికెటర్‌ మాత్రం ఫైనల్‌లో సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేశాడంటా.. టీమిండియాపై సౌతాఫ్రికా గెలవాలని కోరుకున్నాడంటా.. ఈ విషయాన్ని స్వయంగా అతనే వెల్లడించాడు. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో ఇండియాకు కాకుండా సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేస్తాడా? అతను దేశద్రోహి అంటూ కోపం తెచ్చుకోకండి.

ఆ టీమిండియా క్రికెటర్‌ సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేసింది కూడా భారత్‌ గెలవాలనే. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. టీమిండియా యువ క్రికెటర్‌ ధృవ్‌ జురెల్‌, జూన్‌ 29న ఇండియా, సౌతాఫ్రికా ఫైనల్‌ మ్యాచ్‌ను చూస్తూ.. ఇండియా గెలవాలని ఛీర్‌ చేస్తున్నాడు. కానీ, భారత్‌ ఓడిపోయే దశకు చేరుకుంది. సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 రన్స్‌ కావాలి, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌ ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో ఇండియా గెలుస్తుందని, సౌతాఫ్రికా ఓడిపోతుందని ఎవరూ నమ్మరు. సరిగ్గా ఇదే టైమ్‌లో జురెల్‌కు ఒక ఐడియా తట్టింది. ఇంత సేపు ఇండియాకు గెలవాలని కోరుకుంటుంటే.. ఇండియా ఓటమికి దగ్గరైంది.

ఇప్పుడు సౌతాఫ్రికా గెలవాలని కోరుకుందాం అని సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేశాడు. బుమ్రా బౌలింగ్‌తో మ్యాచ్‌ మళ్లీ మలుపు తిరిగింది. మ్యాచ్‌ మన వైపు తిరిగింది. తన సెంటిమెంట్‌ ఏదో వర్క్‌ అవుట్‌ అవుతుందని ధృవ్‌ జురెల్‌ సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేయడం కంటిన్యూ చేశాడు.. అతని సెంటిమెంట్‌ ప్రకారం తాను సపోర్ట్‌ చేసే టీమ్‌ ఓడిపోయి.. ఫైనల్‌గా ఫైనల్‌లో టీమిండియానే గెలిచింది. అందుకే తాను సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేశానంటూ ధృవ్‌ జురెల్‌ గర్వంగా చెబుతున్నాడు. మరి అతని సెంటిమెంట్‌ ప్రకారం అతను టీమిండియాకు కాకుండా సౌతాఫ్రికాకు సపోర్ట్‌ చేయడమే మంచిదైందని అసలు విషయం తెలిసిన క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. చాలా మంది క్రికెట్‌ అభిమానులు కూడా ఇలాంటి ఫన్నీ సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు. మరి ధృవ్‌ జురెల్‌ సెంటిమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments