iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్ చెప్పిన ధోని భార్య! సంతోషంలో ఫ్యాన్స్..

  • Author Soma Sekhar Published - 08:05 PM, Fri - 28 July 23
  • Author Soma Sekhar Published - 08:05 PM, Fri - 28 July 23
గుడ్ న్యూస్ చెప్పిన ధోని భార్య! సంతోషంలో ఫ్యాన్స్..

మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మిస్టర్ కూల్ గా.. బెస్ట్ ఫినిషర్ గా, బెస్ట్ కెప్టెన్ గా తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు. ఇక తన రిటైర్ మెంట్ తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని.. 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపాడు. గతేడాది దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సీఎస్కేను ఈ సారి ఏకంగా ఛాంపియన్ గా నిలిపాడు. అయితే మోకాలి గాయం వేధిస్తున్నా 2023 ఐపీఎల్ సీజన్ మెుత్తాన్ని నెట్టుకువచ్చాడు. ఇక ఈ సీజన్ ముగింపు తర్వాత తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు మిస్టర్ కూల్ ధోని. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ధోని భార్య సాక్షి. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది మహేంద్రసింగ్ ధోనికి 2023 ఐపీఎల్ సీజనే చివరిదని చెప్పుకొచ్చారు. కానీ ఈ సీజన్ ముగిసిన తర్వాత తనకు ఇది చివరి ఐపీఎల్ కాదని ధోని స్పష్టం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు ధోని. రిషబ్ పంత్, నీరజ్ చోప్రాలకు ట్రీట్ మెంట్ చేసిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్హా పార్దీవాలా పర్యవేక్షణలో ధోనికి కీహోల్ ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ధోని భార్య సాక్షి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ధోని ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ధోని భార్య సాక్షి నిర్మాతగా ఈ నిర్మాణ సంస్థ నుంచి LGM అనే సినిమాను నిర్మించిన విషయం కూడా తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా విడుదల సందర్భంగా ధోని భార్య సాక్షి అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా.. ఫ్యాన్స్ ధోని ఎలా ఉన్నారు అని ప్రశ్నించగా..”ఆయన చాలా బాగున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రిహాబ్ లో ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు తలా ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన వీడియోను ధోని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ 2024 ఆడటం ఖాయం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ధోని వచ్చే ఐపీఎల్ ఆడతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by MS DHONI FAN PAGE ™ (@msd7.imran)


ఇదికూడా చదవండి: SKY కోసం సంజూ శాంసన్ కు మళ్లీ అన్యాయం! రోహిత్ ఇది పద్దతేనా అంటూ ఫ్యాన్స్ ఫైర్..

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap