iDreamPost
android-app
ios-app

ధోని కెప్టెన్‌ కూల్‌ కాదు! నోరు తెరిస్తే బూతులే: భారత క్రికెటర్‌

  • Published Jul 05, 2023 | 7:26 PM Updated Updated Jul 05, 2023 | 7:26 PM
  • Published Jul 05, 2023 | 7:26 PMUpdated Jul 05, 2023 | 7:26 PM
ధోని కెప్టెన్‌ కూల్‌ కాదు! నోరు తెరిస్తే బూతులే: భారత క్రికెటర్‌

ప్రపంచ క్రికెట్‌లో మిస్టర్‌ కూల్‌ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేంద్రసింగ్‌ ధోని. ఈ భారత మాజీ కెప్టెన్‌కు భారీ ఫాలోయింగ్‌ ఉంది. అది కేవలం ధోని ఆట చూసి మాత్రమే వచ్చిన ఫాలోయింగ్‌ కాదు. గ్రౌండ్‌లో అతను వ్యవహరించే తీరు, బయట అతని సింప్లి సిటీ చూసి చాలా మంది ధోనిని అభిమానిస్తారు. కెప్టెన్‌ కూల్‌గా పేరొందిన ధోని మ్యాచ్‌ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, జట్టు ఎంతటి కఠిన స్థితిలో ఉన్నా.. తనపై ఎంత ఒత్తిడి ఉన్నా కూడా చాలా కూల్‌గా ఉంటాడు. జట్టులోని ఆటగాళ్లను కూడా ప్రశాంతగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. టీమ్‌ని గెలిపిస్తాడు.

అలాంటి ధోని అసలు కూల్‌ అండ్‌ కామ్‌గా ఉండడని, నోరు తెరిస్తే పచ్చి బూతులు తిడతాడని టీమిండియా క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఇషాంత్‌ మాట్లాడుతూ.. ‘మహీ భాయ్‌ అసలు కూల్‌ అండ్‌ కామ్‌ కానే కాదు. మైదానంలో అందరిని బూతులు తిడతాడు. నన్ను కూడా తిట్టాడు. ఓ సారి త్రో వస్తే నేను పట్టుకోలేకపోయాను. మొదటి సారి చాలా కోపంగా చూశాడు. రెండో సారి అంతే కోపంగా చూసి, మూడో సారి తిట్టేశాడు.

ఓ సారి టెస్టు మ్యాచ్‌లో నా వద్దకు వచ్చి, బౌలింగ్‌ వేసి బాగా అలసిపోయావా? అని అడిగాడు. నేను అవును అలసిపోయాను అని చెప్పగానే, ముసలోడివి అయిపోయావు నీతో కాదు ఆడటం రిటైర్‌ అయిపో’ అని చెప్పినట్లు వెల్లడించాడు. అయితే ధోనికి, ఇషాంత్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి చాలా కాలం పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. మరి ఇషాంత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom